వైవీ సుబ్బారెడ్డి.. జగన్ కు బాబాయ్ వరుస అవుతాడు. గతంలో ఒంగోలు ఎంపీగా చేశాడు. కానీ పోయిన 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో ఎంపీ సీటు దక్కించుకోలేపోయాడు. దగ్గరి బాబాయ్ అయినా కూడా జగన్ పక్కనపెట్టాడు. వేరే పదవి ఇస్తానని హామీ ఇచ్చాడు. అప్పటి పరిస్థితుల్లో అసంతృప్తి ఉన్నా కూడా వైవీ సుబ్బారెడ్డి సర్దుకుపోయారు.
అందుకే జగన్ గద్దెనెక్కగానే వైవీ సుబ్బారెడ్డికి.. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకం.. వేల కోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బాధ్యతలను అప్పజెప్పారు. దీంతో ప్రకాశం జిల్లా రాజకీయ వ్యవహారాలకు వైవీ దూరం అయిపోయారు. అయితే ఎంత పెద్ద నామినేటెడ్ పదవి అయినా సరే రాజకీయ నేతలకు ప్రజల్లో తిరిగితేనే ఆ కిక్కు ఉంటుంది. ఉత్సవ విగ్రహం లాంటి పదవులను వారు కోరుకోరు. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా జనంలోకి వెళితే ఆ క్రేజ్ వేరు. అందుకే ఇటీవల ప్రకాశం జిల్లాలో పర్యటన సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన సంచలనమైంది.
తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉందని.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు వైవీ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ, లేదా మంత్రి పదవి, రాజ్యసభ పదవిపై వైవీ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇటీవలే వైవీ కొనసాగుతున్న టీటీడీ చైర్మన్ పదవీకాలం ముగిసింది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్ ఏమిటీ? జగన్ ఏం చేస్తారు? అన్నది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో తప్పించినజగన్ ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారని హామీఇచ్చారు. కానీ అది జరగలేదు. వైవీని టీటీడీ చైర్మన్ గా పంపారు.ఇప్పుడైనా ఇస్తారా? లేదా ? అన్నది డౌట్ గా మారింది.
జగన్ కొలువుదీరినప్పుడే రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని పునర్వ్యస్థీకరిస్తానని.. ఇప్పుడున్న మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు. కనీసం 80శాతం మందిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తానని స్పష్టం చేశారు. ఇప్పుడు జగన్ పాలనకు రెండున్నరేళ్లు దగ్గరవుతోంది.
ఈ క్రమంలోనే వైవీ సుబ్బారెడ్డిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తారా? లేదా రాజ్యసభకు పంపి ఢిల్లీ వ్యవహారాల్లో జగన్ చోటు ఇస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. ఇక వైవీని తిరిగి టీటీడీ చైర్మన్ గా కూడా నియమించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
టీటీడీ చైర్మన్ పదవీకాలం ముగిశాక మళ్లీ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైవీ సుబ్బారెడ్డి యాక్టివ్ కావడం వైసీపీలో కలకలం చెలరేగింది. అభివృద్ధి పనుల కోసం వైసీపీ నేతలను అందరినీ రమ్మని ఫోన్లు చేసి పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైవీకి ఘనంగా నేతలు కదిలివచ్చి స్వాగతం పలికారు కూడా.. వైవీ కార్యక్రమాల్లో నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు వైవీ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. టీటీడీ పదవిని తాను తిరిగి ఆశించడం లేదని కుండబద్దలు కొట్టినట్టైంది. తనతోపాటు చాలారోజుల నుంచి పనిచేసిన కార్యకర్తలకు న్యాయం జరగాలంటే రాజకీయాల్లో ఉండాలని అనుకుంటున్నానని వైవీ చెప్పుకొచ్చారు.
త్వరలోనే జగన్ కేబినెట్ విస్తరణ, రాజ్యసభ పదవుల భర్తీ ఉండడంతో వైవీ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి జగన్ అంగీకరిస్తారా? లేదా అన్నది వేచిచూడాలి.