దంగల్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయింది బాలనటి జైరా వసీం. ఆ చిత్రంలో అమీర్ ఖాన్ పెద్ద కుమార్తె పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచీ జైరా వార్తల్లో ఉంటోంది. మొన్నటికి మొన్న... ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని జైరా కలుసుకోవడం ఎంత వివాదం అయిందో అందరికీ తెలిసిందే. రాజకీయ - సినీ రంగ ప్రముఖులు కూడా జైరాకు అండగా నిలిచిన విషయమూ తెలిసిందే. ఆ వివాదం పూర్తిగా సద్దుమణిందో లేదో... ఇప్పుడు ఇంకో వివాదంలో ఇరుక్కుంది. ఈసారి జైరాను ఓ కేంద్రమంత్రి వివాదంలోకి లాగారని చెప్పాలి.
ఢిల్లీలో త్యాగరాజ స్టేడియంలో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర క్రీడల శాఖమంత్రి విజయ్ గోయల్ వచ్చారు. ఆర్ట్ గ్యాలరీలోని అన్ని బొమ్మల్నీ చూశారు. వాటిలో ఒకటి ఆయన్ను బాగా ఆకర్షించింది. అదేంటంటే... ఒక పంజరంలో బంధీగా ఉన్న యువతి బొమ్మ. ఆ చిత్రాన్ని ఫోన్ తో క్లిక్ మనిపించి... ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతవరకూ ఓకే, కానీ.. ఆ ఫొటో కింద ఓ కామెంట్ పెడుతూ... ‘ఈ ఆర్ట్ చూస్తుంటే జైరా వసీం పరిస్థితిని తలపిస్తోంది. మన బాలికలు ఇలాంటి పంజరాలను బద్దలుకొట్టుకుని దూసుకెళ్తున్నారు’ అని కామెంట్ పెట్టారు. ఇక్కడే వివాదం మొదలైంది. ఈ ట్వీట్ కి వెంటనే స్పందించేసింది జైరా. మంత్రిగారి అన్వయానికి ధీటుగా జవాబు చెప్పేసింది.
ఆ బొమ్మతో తాను ఎలా కనెక్ట్ అవుతున్నానో చెప్పాలంటూ కేంద్రమంత్రిని ప్రశ్నించింది జైరా. ఆ బొమ్మకీ తనకూ ఎలాంటి పోలికా లేదని స్పష్టం చేసింది. అంతేకాదు... బురఖా ధరించినవారు ఎంతో అందంగా ఉండటంతోపాటు, చాలా స్వేచ్ఛగా ఉంటున్నారని కూడా ముక్తాయించింది. జైరా ఇలా కామెంట్ చేసేసరికి ఖంగు తినడం విజయ్ గోయల్ వంతైంది. తాను చేసిన కామెంట్స్ ను విడమరచి చెప్పాల్సి వచ్చింది. తన ఉద్దేశాన్ని జైరా తప్పుగా అర్థం చేసుకుందనీ, జైరా ఇప్పటికే చాలా సాధించిందనీ, కట్టుబాట్లనూ నిబంధనలనూ తెంచుకుంటూ బాలికలు దూసుకుపోవాలన్నది తన ఉద్దేశం అని విజయ్ గోయ్ వివరణ ఇచ్చారు. మొత్తానికి ఈ ఇష్యూ మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది. అంతేకాదు, పంజరంలోని మహిళతో జైరాను పోల్చడంపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. జైరాకు మద్దతు పలుకుతూ కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/