మ‌త‌గురువు రియాల్టీ పెట్టుబ‌డులు వంద‌కోట్లు!

Update: 2017-01-19 09:15 GMT
వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్‌ కు సంబంధించిన కొత్త కోణం వెలుగులోకి వ‌చ్చింది. ఆయ‌న‌కు సంబంధించిన‌ 78 బ్యాంకు అకౌంట్ల‌పై నిఘా పెట్టిన‌ట్లు నేష‌న‌ల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పేర్కొంది. ఈ విచార‌ణ‌లో భాగంగా జ‌కీర్‌ సంస్థ రియ‌ల్ ఎస్టేట్‌ లో సుమారు వంద కోట్ల వ‌ర‌కు పెట్టుబ‌డుటు పెట్టిన‌ట్లు జాతీయ ద‌ర్యాప్తు సంస్థ పేర్కొంది.  జ‌కీర్‌కు చెందిన భార‌త అకౌంట్లు అన్నీ నిఘాలో ఉన్నాయ‌ని త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. దీని ప్ర‌కారం జ‌కీర్ నాయ‌క్ పీస్ టీవీ పెట్టుబ‌డులు - విదేశీ నిధులు - హ‌వాలా సొమ్ముల‌పై కూడా క్లారిటీ వ‌స్తుంద‌ని వివ‌రించారు.

క‌శ్మీర్‌ కు చెందిన వేర్పాటువేద నేత స‌య్యిద్ అలీ షాహ్ గిలానీకి చెందిన రెండు బ్యాంక్ అకౌంట్ల‌పైన కూడా నిఘా పెట్టిన‌ట్లు ఎన్ ఐఏ వెల్ల‌డించింది. ఇస్లామిక్ స్టేట్‌ కు చెందిన సుమారు 12 కేసుల‌ను ప్ర‌భుత్వం త‌మ‌కు అప్ప‌గించిన‌ట్లు ఎన్ఐఏ తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదం కేసులో సుమారు 52 మంది అనుమానితుల‌ను అరెస్టు చేశామ‌ని, మ‌రో 35 మంది ప‌రారీలో ఉన్న‌ట్లు ఎన్ఐఏ పేర్కొంది. గ‌త ఏడాది ఉగ్ర‌వాదం ఆరోపణలపై అత్యధికంగా 34 కేసులు న‌మోదు అయిన‌ట్లు ద‌ర్యాప్తు సంస్థ వెల్ల‌డించింది. గ‌డిచిన ఏడాది మొత్తం 112 మందిని అరెస్టు చేశామ‌ని, అందులో 64 మందిని జిహాదీ కేసుల కింద అరెస్టు చేసిన‌ట్లు ఎన్ఐఏ స్ప‌ష్టం చేసింది. కాన్పూర్ రైలు ప్ర‌మాదంలో పాకిస్థాన్‌ కు చెందిన ఐఎస్ ఐ హ‌స్తం ఉంద‌ని అనుమానాలు రావ‌డంతో ఆ కేసును త‌మ‌కు అప్ప‌గించాల‌ని కేంద్ర హోంశాఖ‌ను కోరిన‌ట్లు ఎన్ ఐఏ తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News