ఆడేది పాక్ లో కదా... ఆమాత్రం భద్రత ఉండాలి!

Update: 2015-05-19 10:50 GMT
2009లో కరాచీలో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ విషయంతో బస్సులో ఉన్న క్రికెటర్లే కాదు, ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది! అది మొదలు ఇప్పటివరకూ ఈ ఆరేళ్లలో ఒక్క జట్టుకూడా పాక్ లో పర్యటించలేదు! ఈ సంఘటన ఆ స్థాయిలో ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేసింది! ఆ దారుణ ఘట్టంలో ఆరుగుతు భద్రతా సిబ్బందితో పాటు ఒక డ్రైవర్ కూడా మరణించారు! బస్సులో ఉన్న లంక ఆటగాళ్లు మాత్రం సీట్ల కింద దూరి ప్రాణాలు కాపాడుకున్నారు! దాని తర్వాత క్రికెట్ ఆడాలనుకుంటే పాక్ క్రికెటర్లే బయటకు వెళ్లి విదేశీ గడ్డపై ఆడుకుని ఆనందించాలే తప్ప స్వదేశంలో ఆడే అవకాశం లేకుండాపోయింది! 
అయితే తాజాగా నిత్యం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే జింబ్యాంబ్వే క్రికెట్ జట్టు పాక్ పర్యటనకు ఒప్పుకుంది! సుమారు ఆరేళ్ల తర్వాత టెస్టు హోదా కలిగిన ఒక క్రికెట్ జట్టు పాక్ లో పర్యటించడం ఇదే తొలిసారి! అయితే నాటి పరిస్థితిని గుర్తుపెట్టుకున్న పాక్ ప్రభుత్వం... లాహోర్ వచ్చిన జింబాబ్వే క్రికెటర్లకు అసాధారణ భద్రత కల్పించింది! సుమారు 4 వేల మంది భద్రతా సిబ్బందిని మొహరించింది! అయితే ఈ పాక్ పర్యటనలోని జింబాబ్వే జట్టు రెండు టీ-20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి టి-20 జరగనుంది.
Tags:    

Similar News