అత్యున్నత స్థానాలకు చేరుకున్నప్పటికీ సామాన్యుల మాదిరి వ్యవహరించటమే కాదు.. కలలో కూడా ఊహించని రీతిలో ఉండే వారి తీరు విస్మయానికి గురి చేస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి విషయమే కొత్తగా రివీల్ అయ్యింది. దాదాపు మూడేళ్లుగా జరుగుతున్నా..
ఎప్పుడూ బయటకు రాని నిజం ఒకటి బయటకు వచ్చి కార్పొరేట్ ప్రపంచంతో పాటు.. సామాన్యులు సైతం షాక్ అయ్యే పరిస్థితి. ఫుడ్ డెలివరీ సర్వీసుల్ని అందించే సంస్థల్లో ప్రముఖమైనది జొమాటో. ఫుడ్ డెలివరీ అలవాటు ఉన్న వారు తరచూ వినియోగించే యాప్ లలో ఇదొకటి.
అలాంటి జొమాటాకు సీఈవోగా వ్యవహరించే దీపిందర్ గోయల్ కు సంబంధించిన టాప్ సీక్రెట్ ఒకటి బయటకు వచ్చింది. వేలాది మంది పని చేసే సంస్థకు సీఈవో అయినప్పటికీ.. ఆయన కూడా మిగిలిన డెలివరీ బాయ్ గా అవతారం ఎత్తి.. ఆయనే స్వయంగా డెలివరీలు చేస్తున్న వైనం బయటకు వచ్చింది. జొమాటో బాయ్ లు వేసుకునే ఎర్రటి టీషర్టు ధరించి.. మోటారు సైకిల్ వేసుకొని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫుడ్ డెలివరీలు చేస్తుంటారట.
ఈ పనిని సీఈవోగా వ్యవహరిస్తున్న గోయల్ మాత్రమే కాదు.. సంస్థలో పని చేసే మేనేజర్లు సైతం చేస్తుంటారన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. జొమాటో సీఈవో అయిన దీపిందర్ మూడేళ్లుగా ఫుడ్ డెలివరీ ఇస్తున్నా.. తనను ఇప్పటివరకు ఎవరూ గుర్తు పట్టలేదట. ఇప్పుడీ విషయాలన్ని ఎలా బయటకు వచ్చాయంటే..
కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న సంజీవ్ బిఖ్ చందానీ ట్వీట్ రూపంలో ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సో.. జొమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? మీ ఇంటికి వచ్చే జొమాటో బాయ్ వచ్చే వారిలో సంస్థ సీఈవో గోయల్ కూడా ఉండొచ్చు. ఎంత ఎత్తు ఎదిగినా.. ఒదిగి ఉండాలనే సూత్రాన్ని నూటికి నూరుపాళ్లు పాటిస్తున్న గోయల్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.