రాజకీయం రంగులు ఎంత సిత్రమన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏదైనా సానుకూల పరిణామం చోటు చేసుకున్నంతనే అంతా తమదే గొప్పగా చెప్పుకుంటూ క్రెడిట్ మొత్తం తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రదర్శించే తహతహ ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో ఏదైనా తేడా వస్తే.. దానికి సంబంధించిన వివరణను సైతం ఇవ్వకుండా.. దాని బాధ్యత మొత్తం రాజకీయ ప్రత్యర్థుల మీద పడేయటం ఒక అలవాటుగా మారింది.
ఏపీ అధికారపక్ష నేతలు ఇప్పుడు ఇలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారు. ఏపీ విభజన నేపథ్యంలో తెర మీదకు వచ్చిన సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఎజెండాలో ప్రత్యేక హోదా అంశం ఉన్న విషయం బయటకు రావటం.. ఆ వెంటనే ఏపీ అధికారపక్షం సంబరాలు చేసుకోవటం.. దాని క్రెడిట్ మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డికి కట్టబెడుతూ ప్రకటనల మీద ప్రకటనలు ఇవ్వటం తెలిసిందే. అనూహ్యంగా ఎజెండా రాత్రి అయ్యేసరికి మారిపోవటం.. హోదా అంశం అందులో నుంచి మిస్ కావటంతో వైసీపీ నేతల నోట మాట రాని పరిస్థితి.
అప్పటివరకు జగన్ గొప్పల డప్పు కొట్టిన ఏపీ అధికారపక్ష నేతలు.. ఎజెండా మారిన క్షణం నుంచి వారికి ప్రతిపక్ష నేత చంద్రబాబు గుర్తుకు వచ్చారు. ఆయనపై విమర్శల వర్షం కురిపించటంతో పాటు.. అప్పుడెప్పుడో జరిగిన విషయాల్ని ప్రస్తావిస్తూ.. తప్పంతా బాబుదే అంటూ తేల్చేశారు. బాబు పాలన నచ్చక.. ఆయన తీరును తప్పు పట్టిన కారణంగానే ప్రజలు తమ చేతికి అధికారం ఇచ్చారన్న లాజిక్ ను మిస్ అవుతున్న వైసీపీ నేతలు తాజాగా చంద్రబాబును టార్గెట్ చేశారు.
తాజాగా ఏపీ మంత్రి పేర్ని నాని.. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిలు చంద్రబాబుపై మండిపడ్డారు. తన కోవర్టులను బీజేపీలో చేర్చి నాటకాలు ఆడుతున్నట్లుగా మండిపడిన వారు.. చంద్రబాబు అధికారంలో ఉన్న వేళలో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి.. ప్యాకేజీకి ఒప్పుకోని కనీసం అది కూడా సాధించలేదన్నారు. అందుకు ఏపీ ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్నారు.
రాష్ట్రానికి అన్యాయం చేయటంలో చంద్రబాబు మార్గదర్శకత్వంలో కుట్ర జరుగుతోందన్న వారు.. ఈ ర్ష్య.. ద్వేషాలతో కూడిన నీచ రాజకీయాల్ని కట్టిపెట్టాలన్నారు. విభజన అంశాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన కమిటీ ఎజెండాలో తొలుత చేర్చిన ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీలో చేరిన తన కోవర్టులు ద్వారానే చంద్రబాబు తొలగించారన్నారు. ఈ సందర్భంగా వారు సరికొత్త వాదన వినిపించారు.
ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత.. ప్రధాని మోడీతో భేటీ అయ్యాక విభజన సమస్యల పరిష్కారం మీద కదలిక మొదలైందని చెప్పారు. ఒకవేళ ఇదే నిజమైతే.. కేంద్రాన్ని అంతలా కదిలించే కెపాసిటీ ఉన్న జగన్.. ప్రత్యేక హోదా అంశాన్ని బాబు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు.. నిలువరించొచ్చు కదా? అన్నది ప్రశ్న.
బీజేపీలో చేరిన టీడీపీ నేతల చేత బీజేపీ నిర్ణయాల్ని ప్రభావితం చేసే సత్తా ఉన్నపక్షంలో.. అసలు చంద్రబాబుతో మళ్లీ లంకె వేయించేస్తారు కదా? అది చేయని వారు.. చంద్రబాబు చెబితే మోడీ సర్కారు తన ఎజెండాను మార్చేస్తుందా? అసలు చంద్రబాబును దగ్గరకు రానిచ్చే పరిస్థితే ఉంటే.. జగన్ సర్కారు ఇప్పుడీ మాటలు చెప్పే పరిస్థితే ఉంటుందా? అన్నది మరో ప్రశ్న. ఇదంతా చూసినప్పుడు వైసీపీ ఇద్దరి నేతల తాజా మాటలు చూసినప్పుడు క్రెడిట్ వస్తే మొత్తం జగన్ ఖాతాలోకి.. తేడా వస్తే మాత్రం చంద్రబాబుకు తిట్ల దండకం పఠించటం ఒక అలవాటుగా మార్చుకున్నట్లుగా అనిపించక మానదు.