పేరుకు జైలే కానీ.. దొరకంది ఏమీ ఉండదని గతంలో చాలామందే చెప్పారు. జైల్లోని కతల గురించి ఆ మధ్య జైలుకెళ్లి వచ్చిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రూపాయికి ఫోన్ కాల్ చేసే దానికి రూ.25 ఇస్తే కానీ ఫోన్ చేసుకోనివ్వరని.. జైల్లో పరిస్థితులేమీ బాగోలేవని.. జైల్లో జరిగే మోసాల గురించి తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని కూడా రేవంత్ చెప్పుకొచ్చారు.
తాజాగా చర్లపల్లి జైల్లోని బ్రహ్మపుత్ర బ్యారెక్ లో పెద్ద మొత్తంలో గంజాయిని జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏదో చిన్న చితకా పొట్లాం కాకుండా ఏకంగా కేజిన్నర గంజాయిని జైల్లో దొరకటం సంచలనం సృష్టిస్తోంది.
నిజానికి.. చర్లపల్లి జైల్లోని అక్రమాల గురించి చాలానే ఆరోపణలు ఉన్నాయి. అయితే.. అలాంటివేమీ లేవని.. చర్లపల్లి జైల్లో పరిస్థితి బ్రహ్మాండంగా ఉందంటూ అధికారులు పదే పదే చెబుతుంటారు. అయితే.. తాజా ఘటన మాత్రం సంచలనం సృష్టిస్తోంది. ఇంత భారీ మొత్తంలో గంజాయి జైల్లోకి ఎందుకు వచ్చింది? ఎవరు వినియోగిస్తుంటారు? అసలు ఎవరు తీసుకొచ్చారు? బయటకు వచ్చిన గంజాయి ఉదంతం కాకుండా.. మిగిలిన ఆరోపణల మాటేమిటి? ఈ రాకెట్ వెనుక ఎవరున్నారు? లాంటి ప్రశ్నలెన్నింటికో సమాధానం దొరకాల్సి ఉంది. చూస్తుంటే.. ఆకస్మికంగా కానీ పెద్ద ఎత్తున చర్లపల్లి జైల్లో తనిఖీలు చేయాలే కానీ.. మరెన్ని లీలలు బయటకు వస్తాయో..?