ఏపీ అసెంబ్లీని రెండు రోజులుగా కుదిపేస్తున్న అంశం ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్. ముఖ్యమంత్రిపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమెపై స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అసెంబ్లీలో వైకాపా నేతలు తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారు. సభను స్తంభింపచేస్తున్నారు.. బాయ్ కాట్ చేస్తున్నారు. అయితే శాసనసభ జరుగుతున్న తీరుపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఓ వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం రెండు రోజుల క్రితం తాపీగా అసెంబ్లీకి వచ్చారు. `కాకుల్లా గోల.. జంతువుల్లా అరుపులు ఇదీ శాసనసభ జరుగుతున్న తీరు.` అంటూ ఆయన తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. అలాగే జగన్ ను ఉద్దేశించి మా వాడికి ఎలా ఉండాలో బుద్ధి చెప్పడానికే అసెంబ్లీకి వచ్చానని కూడా ఆయన అన్నారు.
జేసీ ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలైనా గడవకముందే ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం చంద్రబాబు పై రోజా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కాల్ మనీ వివాదాన్ని దీనికి ముడి పెట్టారు. ఆయనేమన్నారో జేసీ మాటల్లోనే... `ఇంత పెద్ద రాష్ట్రంలో విజయవాడలో కాల్ మనీ వ్యవహారం జరిగితే దీనికి చంద్రబాబుని ఎలా బాధ్యులను చేస్తారు. మళ్లీ ఆ అమ్మాయి ఎవరు? రోజానా? అదేంటమ్మా.. కామా ముఖ్యమంత్రా? ఏంది తల్లీ అది? ` అని విలేకరులను ప్రశ్నించారు. కామా అంటే.. కాల్‌మనీ అని చెప్పడంలో ఒకింత ఆశ్చర్యం వక్తంచేశారు. `కామ` అంటే ఆ కామ కాదా? అని ప్రశ్నించారు. ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఎక్కడైనా ఉందేమో అని అనుకుంటున్నామని ఆయన వ్యంగ్యంగా సెటైర్లు వేశారు.