బీహార్ అంటే అది అండమాన్ ఎంత మాత్రమూ కాదు. మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు కొన్ని రకాల ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లుగానే.. మన దేశంలో బీహార్ అంటే కూడా.. కొన్ని ప్రత్యేక మైన లక్షణాలు గుర్తుకు వస్తాయి. అలాంటి బీహార్ లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమరం ముమ్మరంగా జరుగుతోంటే.. భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయించడానికి ఏపీ నేతలు కూడా ఒక బృందంగా అక్కడ ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల అండమాన్, పోర్ట్ బ్లెయిర్ లో మునిసిపల్ ఎన్నికలు జరిగితే... ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలనుంచి భాజపా నాయకులు వెళ్లి అక్కడ ప్రచారం చేసి వచ్చారు. మొత్తానికి అక్కడ భాజాపానే గెలిచింది. ఇలా పొరుగు రాష్ట్రాల్లో తెలుగు ఓట్లు వేయించడనికి తమ కరిష్మా పనిచేస్తుందని వారికి నమ్మకం కుదిరిందేమో తెలియదు గానీ, మొత్తానికి ఏపీ నాయకులు బీహార్ లో ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారుట.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు ఆధ్వర్యంలో ఒక బృందంగా బీహార్ కు వెళ్లి.. అక్కడ తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం సాగిస్తారుట. సాధారణంగా కులాల హవాను బట్టి ఎన్నికల ఫలితాలు నిర్ణయం అయ్యే బీహార్ లో ఈసారి ప్రాంతాలవారీ మనుషులు ఎందరున్నారో కూడా లెక్క తీయడానికి అమిత్ షా పూనుకున్నట్లుంది. అందుకే.. ఆయన ఏపీ ప్రజలు కూడా గణనీయంగా గుర్తించి, ఆమేరకు ఈ ప్రాంతపు నాయకుల్ని ప్రచారానికి రమ్మని చెప్పారుట.
వ్యూహరచన వరకు బాగానే ఉంది. 'తమ వారు' అయిన నాయకులు ఏపీనుంచి ప్రత్యేకంగా వచ్చి ప్రచారం చేస్తున్నారంటే.. తెలుగువారు ఆసక్తిగానే స్పందిస్తారు. అయితే.. అండమాన్ వంటి ప్రశాంతమైన ప్రాంతంలో ఉన్నంత సునాయాసంగా బీహర్ వంటి సంక్లిష్టమైన ప్రాంతంలో ఎన్నికల ప్రచారం ఉండకపోవచ్చునని ఆ పనికి సిద్ధమవుతున్న నేతలు గుర్తుంచుకుంటే బాగుంటుంది. మాణిక్యాలరావు - సోము వీర్రాజు తదితరుల నేతృత్వంలో బృందాలుగా ప్రచారం సాగుతుందిట. ఏయే నియోజకవర్గాల్లో, ఎన్నేసి రోజులు అనే కార్యాచరణ ప్రణాళిక మాత్రం ఇంకా సిద్ధం కాలేదని అంటున్నారు.