కేసీఆర్ పాలనలో స్పీడ్ మిస్? వీడియో కాన్ఫరెన్సు సందేశం చెబుతున్నది ఇదేనా?
దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నా.. మరే రాష్ట్రంలో కనిపించని రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు ఉంటుందని చెబుతారు. వరుస పెట్టి రివ్యూలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నట్లు కనిపించే కేసీఆర్.. ఉన్నట్లుండి కామ్ అయినట్లు కనిపిస్తారు. ఆయన అధికార నివాసమైన ప్రగతి భవన్ కామ్ గా ఉండిపోతుంది. ఐదారు రోజులు గడిచిన వెంటనే మళ్లీ చైతన్యం వెల్లివిరిస్తుంటుంది. మధ్యలో ఏమవుతుందన్న ఆరా తీస్తే సీఎంవారు ఫామ్ హౌస్ కు వెళ్లినట్లుగా చెబుతారు.
వారంలో ఎన్ని రోజులు ప్రగతి భవన్ లో ఉంటారో? మరెన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉంటారన్న లెక్క చెప్పటం కష్టమే. ఎందుకంటే.. అంత తరచు రాకపోకలు సాగుతూ ఉంటాయి మరి. ఇదిలా ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమేం చేస్తే బాగుంటుందన్న విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై. రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఆమె.. వివిధ రంగాలకు చెందిన నిపుణులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఇదంతా చదివినప్పుడు ప్రధాని మోడీ గుర్తుకు రాక మానరు. మహమ్మారి తొలిదశలో ఉన్నప్పుడు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో అదే పనిగా వీడియో కాన్ఫరెన్సుల్ని నిర్వహించేవారు. తమిళసై కూడా ఇప్పుడు అదే బాట పట్టినట్లుగా కనిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీకి భిన్నంగా నిర్దారణ పరీక్షలు వీలైనన్ని ఎక్కువగా చేయాలన్న సూచన చేయటం గమనార్హం.
అంతేకాదు.. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలన్నకీలక వ్యాఖ్య ఆమె నోటి నుంచి వచ్చింది. నిజానికి.. ఇలాంటి ఆలోచనలు ప్రభుత్వాధినేతకు వచ్చి ఉంటే బాగుండేది. అందుకు భిన్నంగా గవర్నర్ కు రావటం చూస్తే.. కేసీఆర్ పాలనలో లోపించిన అంశాలేమిటో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు. అంతేకాదు.. ప్రతి విషయానికి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అని పెట్టుకోకుండా.. కొన్ని అంశాల విషయంలో ప్రత్యేక విధానాన్ని పాటించాలని పేర్కొనటం విశేషం. మొత్తంగా చూస్తే.. తానేం చేయలేకపోతున్నానన్న విషయాన్ని కేసీఆర్ కు గవర్నర్ తమిళ సై తన చేతలతో చేసి చూపిస్తున్నారా? అన్న భావన కలిగేలా చేస్తున్నారని చెప్పక తప్పదు.