ఉర్ఫీ ఇన్‌స్టా ఖాతా స‌స్పెండ్.. కానీ ఇంత‌లోనే

సోషల్ మీడియా సంచలనం ఉర్ఫీ జావేద్ తన అసాధారణ డ్రెస్సింగ్ సెన్స్ తో ఎల్లప్పుడూ హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.

Update: 2023-12-03 18:24 GMT

ఉర్ఫీ జావేద్ తన అసాధారణమైన డ్రెస్సింగ్ సెన్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈసారి తన పోస్ట్‌లలో ఒకదాని గురించి చర్చల్లోకి వచ్చింది. ఉర్ఫీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయడ‌మే దీనికి కార‌ణం.. వివ‌రాల్లోకి వెళితే..


సోషల్ మీడియా సంచలనం ఉర్ఫీ జావేద్ తన అసాధారణ డ్రెస్సింగ్ సెన్స్ తో ఎల్లప్పుడూ హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఉర్ఫీ స్వ‌యం ప్ర‌కాశ‌క డిజైన‌ర్ కావ‌డంతో చెల‌రేగి ప్ర‌యోగాలు చేస్తోంది. 26 ఏళ్ల ఉర్ఫీ దేశంలో చర్చనీయాంశంగా ఉండటానికి ఏ అవకాశాన్ని వదిలిపెట్టదు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా బోల్డ్ ఫోటోలు వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. కానీ ఇటీవల ఉర్ఫీపై ఇన్ స్టా ఇండియా ప్ర‌తినిధులు కఠినమైన చర్యలు తీసుకున్నారు. దాని గురించి ఈ భామ‌ తన సోషల్ మీడియాలో స్వయంగా వెల్ల‌డించింది.


ఇన్‌స్టా ఖాతా సస్పెండ్:

ఇటీవల ఉర్ఫీ జావేద్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ అయింది. ఉర్ఫీ దాని స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. ఈ ఫోటోలో త‌న‌ ఖాతాను సస్పెండ్ చేసామని ఇన్‌స్టాగ్రామ్ నుండి వచ్చిన వాక్యం క‌నిపించింది. ఖాతాను సస్పెండ్ చేసినప్పుడు ఉర్ఫీ ఎలా పోస్ట్ చేసిందో చూడ‌గానే అంతా ఆశ్చర్యపోయారు. త‌న‌ను ఇన్ స్టా ఖాతా నుంచి తొల‌గించ‌డానికి కార‌ణం.. బోల్డ్ ఫోటోలను షేర్ చేయ‌డ‌మేన‌ని తెలిపింది. అయితే, సస్పెన్షన్ వెనుక ఉన్న నిర్దిష్ట కారణాలు తెలియరాలేదు. ఇది ఆమె అభిమానులు అనుచరులను ఆసక్తిగా ఉంచింది. కొంత సమయం తరువాత ఉర్ఫీ త‌న‌ ఖాతా తిరిగి పున‌రుద్ధ‌రించ‌బ‌డిందని తెలియ‌జేసింది. దాని స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడం ద్వారా ఈ విష‌యాన్ని అభిమానులకు తెలియజేసింది. త‌న‌ను ద్వేషించేవారిపై ఉర్ఫీ మ‌రోసారి విరుచుకుపడింది. ఈ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ.. ఉర్ఫీ క్యాప్షన్‌లో ఇలా రాసింది. ఈ రోజు నేను చాలా మంది కోరికలు తీరాయ‌ని అనుకుంటున్నాను`` అని రాసింది.

మళ్లీ ఉర్ఫీ జావేద్‌పై ట్రోలింగ్ :

ఇప్పుడు ఈ పోస్ట్‌పై చాలా మంది అభిమానులు ఉర్ఫీకి మద్దతుగా వచ్చారు. చాలా మంది త‌న‌ను మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. ఉర్ఫీని ట్రోల్ చేస్తూ ఒక నెటిజ‌న్ ఇలా రాసారు. ``ఇది నేను చూసిన 2023 ఉత్తమ పోస్ట్ అని వ్యాఖ్యానించ‌గా, మరొకరు ``ఉర్ఫీ ఖాతా మూసివేయడం మంచిదే`` అని రాసారు. మరొక నెటిజ‌న్ ఇలా రాసారు. నేను ఎదురుచూస్తున్న క్షణం వచ్చింది.. ఇంత‌లోనే మ‌ళ్లీ పోయింది! అని నిరాశ‌ప‌డ్డాడు పాపం.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఉర్ఫీ జావేద్ చాలా మంది పెద్ద డిజైనర్లతో కలిసి పనిచేస్తున్నారు. ఇటీవల మసాబా గుప్తాతో కలిసి పనిచేసింది. అదే సమయంలో దీనికి ముందు ఏస్ డిజైనర్లు అబు జానీ - సందీప్ ఖోస్లాలకు షో-స్టాపర్‌గా మారింది.

Tags:    

Similar News