షాకింగ్ రీజన్... అతిగా నిద్రపోయి భారత్ తో మ్యాచ్ కు దూరం!

ఇందులో భాగంగా... ఇంత ముఖ్యమైన మ్యాచ్ కు అతడు దూరమవ్వడానికి గల కారణం అతిగా నిద్రపోయి, బస్సును అందుకోలేకపోవడమే అని తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి చెప్పారు.

Update: 2024-07-03 05:30 GMT

ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో భారత్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించిన సంగతి తెలిసిందే. రోహిత్ సేన చేసిన ప్రదర్శన ఫలితంగా ప్రపంచ కప్ ను టీం ఇండియా ఎగరేసుకుపోయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.. చరిత్ర సృష్టించింది. ఈ సమయంలో బంగ్లాతో జరిగిన మ్యాచ్ కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... వరల్డ్ ఛాంపియన్ గా మారే దిశగా టీంఇండియా ప్రయాణంలో సూపర్ 8లో జరిగిన పోరులో బంగ్లాదేశ్ ను చిత్తుచేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాప్ స్కోర్ హార్ధిక్ పాండ్యా (27 బంతుల్లో 50 నాటౌట్: 4 ఫోర్లు - 3 సిక్సులు).

అనంతరం ఛేజింగ్ కు దిగిన బంగ్లా జట్టు.. భారత బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో... ఈ మ్యాచ్ లో భారత్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఇద్దరు పేసర్లను మాత్రమే ఆడించింది. వారి స్టార్ ఫేసర్, వైస్ కెప్టెన్ తస్కిన్ అహ్మద్ ఈ మ్యాచ్ లో ఆడలేదు.

దీంతో... సూపర్ 8లో భారత్ లాంటి బలమైన జట్టుతో జరుగుతున్న ఇంత కీలకమైన మ్యాచ్ లో అతడు ఎందుకు ఆడలేదు అనేది వైరల్ గా మారింది. భారత్ పై తప్పక గెలవాల్సిన మ్యాచ్ కు స్టార్ ఫేసర్, వైస్ కెప్టెన్ గైర్హాజరవ్వడం ఏమిటనే చర్చ విపరీతంగా జరిగింది. అలా అని అతడికి ఎలాంటి గాయాలూ కాలేదు.. సంపూర్ణ ఆరోగ్యంతో ఫిట్ గానే ఉన్నాడు. అయినా ఆడపోవడానికి గల షాకింగ్ రీజన్ తాజాగా రివీల్ అయ్యింది.

Read more!

ఇందులో భాగంగా... ఇంత ముఖ్యమైన మ్యాచ్ కు అతడు దూరమవ్వడానికి గల కారణం అతిగా నిద్రపోయి, బస్సును అందుకోలేకపోవడమే అని తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి చెప్పారు. అతడు అతిగా నిద్రపోయి బస్సు మిస్సయ్యాడు.. తర్వాత వేరే వాహనం తీసుకుని వచ్చినప్పటికీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడని అన్నారు. అయితే... బస్సు అందుకోలేకపోయినందుకు తోటి ఆటగాళ్లతోపాటు అందరికీ తస్కిన్ క్షమాపణలు చెప్పాడు. దీంతో ఈ రీజన్ వైరల్ గా మారింది.

Tags:    

Similar News

eac