ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... ఫైనల్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఇదే!
వన్డే ప్రపంచకప్ ఫైనల్ కు సమయం ఆసన్నమైంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎవరి ప్లాన్స్ వారు వేసుకుంటున్నారు.
వన్డే ప్రపంచకప్ ఫైనల్ కు సమయం ఆసన్నమైంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎవరి ప్లాన్స్ వారు వేసుకుంటున్నారు. ఆ మ్యాచ్ ఎక్కడ చూడాలి, ఎవరెవరితో కూర్చుని చూడాలి వంటి లెక్కలు వేస్తున్నారు. ఇక టీం ఇండియా ఫ్యాన్స్ కి అయితే చెప్పే పరిస్థితే లేదు. వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ప్రపంచంలోని పెద్దదైన నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఈ మ్యాచ్ జరుగుతుంది.
ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్... రెండు విభాగాల్లోనూ సూపర్ ఫాం లో ఉన్న టీం ఇండియాకు ఈ పిచ్ ఎలా సహకరించబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయంగా ఉంది. అయితే మొదట్లో అన్నీ ఛేజ్ చేసి గెలిచిన టీం ఇండియా.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ ఖాయమనేది తెలిసిన విషయమే! కారణం... ఈ పిచ్ ఫస్ట్ బ్యాటింగ్ కి సహకరిస్తుందని క్యూరేటర్ చెబుతున్నారు!
ఈ సందర్భంగా స్పందించిన స్టేట్ అసోసియేషన్ క్యూరేటర్... స్లో బ్యాటింగ్ ట్రాక్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం భారీ స్కోరు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 315 పరుగులు చేస్తే డిఫెండ్ చేయవచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో... సెకండ్ బ్యాటింగ్ చేసేవారికి మాత్రం పరిస్థితి కాస్త కష్టంగా ఉంటుందని అంటున్నారు.
దీంతో ఈ మ్యాచ్ లో టాస్ అత్యంత కీలకం కాబోతుందా అనే ప్రశ్న మొదలైంది. రేపటి మ్యాచ్ లో టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుని, టీం ఇండియా ఓపెనర్లు రోహిత్ - గిల్ లు శుభారంభాన్ని అందిస్తే.. ఇక విరాట్ కొహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్, సూర్య, జడేజా లు ఎవరి పని వారు చక్కబెడితే... స్కోర్ బోర్డ్ ఎంత దూరం వెళ్లాలో అంత దూరం వెళ్లే అవకాశం ఉంది!
ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం లేకపోతే... బూమ్రా, షమీ, సిరాజ్, కుల్ దీప్, జడేజా లు కాస్త కష్టపడాల్సి వస్తుంది! అయితే ప్రస్తుతం షమీ ఫుల్ ఫాం లో ఉన్న సంగతి తెలిసిందే. అతను ఆడిన ఈ వరల్డ్ కప్ మ్యాచ్ లన్నింటిలోనూ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ని వణికించేశాడు. మరి రేపటి ఫైనల్ మ్యాచ్ లో ఆసిస్ బ్యాటర్స్ ని ఏ మేరకు కంగారు పెట్టిస్తాడనేది వేచి చూడాలి!
కాగా... సుమారు 20ఏళ్ల క్రితం 2003 వన్డే ప్రపంచకప్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 359 పరుగులు చేసింది. అనంతరం భారత్ 234 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో.. రేపటి ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఆస్ట్రేలియాను ఓడించాలని.. రివేంజ్ తీర్చుకోవాలని.. గంగూలీ సేనకు గిఫ్ట్, పాంటింగ్ సేనకు రిటన్ గిఫ్ట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు టీం ఇండియా క్రికెట్ అభిమానులు!