'టీమ్ ఇండియా'కు ముందే న్యూ ఇయర్

భారతీయులంతా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొనడానికి ఐదున్నర గంటల ముందే టీమ్ ఇండియా క్రికెటర్లు 2025లోకి అడుగుపెట్టారు.

Update: 2024-12-31 15:14 GMT

భారతీయులంతా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొనడానికి ఐదున్నర గంటల ముందే టీమ్ ఇండియా క్రికెటర్లు 2025లోకి అడుగుపెట్టారు. అదెలా..? వారూ భారతీయులే కదా..? మనతోపాటే కొత్త ఏడాదిలోకి వచ్చినట్లు కదా? అంటారా? ఇందులోనే చిన్న మెలిక ఉంది.

టీమ్ ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. 33 ఏళ్ల తర్వాత ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు జరిగాయి. మరోవైపు నవంబరు 22న మొదలైన తొలి టెస్టు కోసం టీమ్ ఇండియా వారం ముందే ఆస్ట్రేలియాలో అడుగు పెట్టింది.

ఇక డిసెంబరు 26 నుంచి మెల్ బోర్న్ లో నాలుగో టెస్టు ఆడింది. ఇప్పటివరకు ఒక్క టెస్టు (తొలి) మాత్రమే నెగ్గింది. గులాబీ బంతితో జరిగిన రెండో టెస్టులో పరాజయం పాలైంది. మూడో మ్యాచ్ లో వర్షం కారణంగా ఎక్కువ శాతం సమయం వేస్ట్ అయింది. దీంతో ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ప్రసిద్ధిచెందిన బాక్సింగ్ డే టెస్టు డిసెంబరు 26న మొదలై.. 30న ముగిసింది. ఈ మ్యాచ్ కూడా డ్రా అవుతుందని భావించినా ఐదో రోజు చివరి సెషన్ లో వరుసగా ఏడు వికెట్లు కోల్పోయి భారత్ ఓటమిపాలైంది.

కాగా, ఇప్పటివరకు నాలుగు టెస్టులు జరగ్గా అన్నీ.. 2024లోనే జరిగాయి. ఐదోది, చివరిది అయిన టెస్టు మాత్రం జనవరి 3న శుక్రవారం మొదలుకానుంది.

ముందే వచ్చేసింది

భారతీయులకు మంగళవారం అర్థరాత్రి తర్వాత.. 2025 రానుండగా.. టీమ్ ఇండియా క్రికెటర్లకు మాత్రం ఐదున్నర గంటలు ముందుగానే వచ్చేసింది. కాగా, టీమ్ ఇండియా ఇప్పుడు మెల్ బోర్న్ లో ఉంది. అక్కడ సమయం భారత్ కంటే అయిదున్నర గంటలు ముందుంటుంది.

ఇక ఆస్ట్రేలియా చాలా పెద్ద దేశం. టైమ్ జోన్లు కూడా వేరుగా ఉంటాయి. అయితే, మెల్ బోర్న్, సిడ్నీలో ఒకే టైమ్ జోన్. సిడ్నీలోనూ మన కంటే టైమ్ ఐదున్నర గంటలు ముందు ఉంటుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియాకు హ్యాపీ న్యూ ఇయర్ ముందే వచ్చేసింది.

మరోవైపు ఎప్పటిలానే ఆస్ట్రేలియాలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి. మనకంటే అయిదున్నర గంటల ముందే అక్కడ నూతన సంవత్సరం మొదలైంది. కొత్త ఆశలతో సంబురంగా

ఆస్ట్రేలియా ప్రజలు 2025 కు స్వాగతం పలికారు.

సిడ్నీ టెస్టు గెలిస్తేనే

సిడ్నీ టెస్టులో టీమ్ ఇండియా గెలిస్తేనే హ్యాపీ న్యూ ఇయర్ అవుతుంది. ఈ మ్యాచ్ లో ఓడితే సిరీస్ ను 3-1తో కోల్పోయినట్లే. పైగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరడమూ కష్టం అవుతుంది.

Tags:    

Similar News