ఆటగాళ్ల పాస్ పోర్ట్ లు హ్యాండోవర్.. ఐపీఎల్ రెండో దశ ఎక్కడ?

మరో రెండు, మూడేళ్లలో ఐపీఎల్ విలువ రూ.లక్ష కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు.

Update: 2024-03-16 16:30 GMT

యూరప్ లోని ఫుట్ బాల్ లీగ్ లు, అమెరికాలోని బాస్కెట్ బాల్ లీగ్ లు.. ఆటకు ఆట.. క్వాలిటీకి క్వాలిటీ.. మరి క్రికెట్ కు పెద్దన్న అయిన మన భారత దేశంలో అలాంటి లీగ్ లు సాధ్యమా? దీనికి సమాధానంగా 16 ఏళ్ల కిందట పుట్టుకొచ్చిందే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ప్రపంచంలో ఎన్నో లీగ్ లు జరుగుతున్నా మనదగ్గర మాత్రమే అత్యంత ప్రేక్షకాదరణ అనడంలో సందేహం లేదు. మరో రెండు, మూడేళ్లలో ఐపీఎల్ విలువ రూ.లక్ష కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు.

ఎన్నికల అడ్డంకి..

ఐపీఎల్ 17వ సీజన్ మరొక్క వారం రోజుల్లో మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీ పడనుంది. వచ్చే శుక్రవారం చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈసారి లీగ్ కు సార్వత్రిక ఎన్నికలు అడ్డంకిగా మారాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇలా జరిగేదే. భారత్ వంటి అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కంటే ఏదీ ఎక్కువ కాదు. దేశంలో ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల అవనున్న నేపథ్యంలో లీగ్ నిర్వహణ పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

మొదటి దశ మనదగ్గరే

ఐపీఎల్ కు సంబంధించి బీసీసీఐ గత నెలలోనే తొలి దశ షెడ్యూల్ వెల్లడించింది. ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 7 వరకు మన దేశంలోనే మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుండడంతో తదుపరి దశ ఎక్కడ నిర్వహిస్తారు. అనే ప్రశ్న వస్తోంది. రెండో దశ వేదిక మారే అవకాశం ఖాయం కావడంతో ఇప్పటికే ఆటగాళ్ల పాస్‌ పోర్టులను ఫ్రాంచైజీలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాల పరిమితికి సంబంధించి ఇబ్బందులు ఎదురవకుండా చూస్తోంది.

యూఏఈనా? దుబాయ్ నా?

ఐపీఎల్ రెండో దశ వేదిక యూఏఈనా? దుబాయ్‌ నా? అనేదానిపై సందిగ్ధత నెలకొంది. బీసీసీఐ, ఐపీఎల్‌ కమిటీ ఏర్పాట్లపై ఎలాంటి ప్రకటన రాలేదు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ తర్వాత బీసీసీఐ తుది నిర్ణయం వచ్చే వీలుంది. అయితే, లీగ్ ఇక్కడే పూర్తిగా నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ ధుమాల్ గతంలో చెప్పారు. ఇప్పుడు ఎన్నికల తేదీలను బట్టి మిగతా మ్యాచ్‌ లను ఇక్కడే నిర్వహించాలా? వేరేచోటకు తరలించాలా? అనేది తేలుతుంది.

Tags:    

Similar News