గుకేశ్, మను ఖేల్ రత్నాలు.. తెలుగోళ్లు ఇద్దరు 'అర్జునులు'

అథ్లెటిక్స్ లో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జివాంజి దీప్తి అర్జున పురస్కారాలకు ఎంపికయ్యారు. దీప్తి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారు. జ్యోతి ఏపీలోని విశాఖ పట్నం వాసి.

Update: 2025-01-02 10:24 GMT

భారత క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారం ఖేల్ రత్న. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ పేరిటే ఏటా దీనిని ప్రదానం చేస్తుంటారు. గత ఏడాదికి గాను ఖేల్ రత్నాల ఎంపిక విషయమై చిన్న కలకలం రేగిన సంగతి తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ ‘బుల్లెట్’ మను బాకర్ ను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు పరిగణిస్తారా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది. మను లేకుంటే వాస్తవానికి పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పతకాల పట్టికలో మరింత వెనుకబడేది. ఆమె సాధించిన రెండు కాంస్యాలు కాస్త పరువు నిలిపాయి. కాగా, రాజీవ్ ఖేల్ రత్నకు మను దరఖాస్తు చేయలేదని.. అందుకని ఆమెను అవార్డుకు పరిగణనలోకి తీసుకోరనే వాదనలు వినిపించాయి. వీటికి తెరదించింది కేంద్ర ప్రభుత్వం.

చదరంగా చాంపియన్ గుకేశ్

2024 సంవత్సరానికి గాను నలుగురికి ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌రత్న పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. చదరంగంలో గత నెలలో ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు గుకేశ్ దొమ్మరాజు. ఇక పారిస్ ఒలింపిక్స్ లో భారత జట్టు కాంస్యం నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు హాకీ కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌. పారా అథ్లెట్‌ విభాగంలో ప్రవీణ్‌ కుమార్‌ తో పాటు షూటింగ్‌ లో మను బాకర్‌ ను ఖేల్ తర్న పురస్కారాలకు ఎంపిక చేసింది.

తెలుగు తేజాలకు అర్జున కేంద్ర ప్రభుత్వం ఇద్దరు తెలుగు తేజాలను అర్జున పురస్కారాలకు ఎంపిక చేసింది. అథ్లెటిక్స్ లో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జివాంజి దీప్తి అర్జున పురస్కారాలకు ఎంపికయ్యారు. దీప్తి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారు. జ్యోతి ఏపీలోని విశాఖ పట్నం వాసి.

ఈ నెల 17న ప్రదానం..

ఖేల్ రత్న గ్రహీతలకు ఈ నెల 17న ఉదయం 11గంటలకు ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

Tags:    

Similar News