ఆ దిగ్గజానికిదే ఆఖరి ఐపీఎల్ మ్యాచ్.. క్లారిటి ఇచ్చేసిన మరో దిగ్గజం..

ఇప్పటికే నాలుగేళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్న అతడు వచ్చే సీజన్ నుంచి మొత్తం క్రికెట్ కే దూరం కానున్నాడు.

Update: 2024-05-18 11:48 GMT

2004కు ముందు వరకు భారత్ నుంచి ఇలాంటి క్రికెటర్ వస్తాడా? అనిపిపించింది. 2024లోకి వచ్చాక ఈ 20 ఏళ్లలో అతడి ప్రస్థానం చూశాక ప్రపంచంలోనే అలాంటి క్రికెటర్ ఎవరూ ఉండరు అని తేలిపోయింది. క్రికెట్ అంటే బాడీతోనే కాదు మైండ్ తోనూ ఆడాలని నిరూపించిన దిగ్గజం అతడు. అలాంటి వాడు ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత తిరిగి మైదానంలో కనిపించడు అని తెలుస్తోంది. ఇప్పటికే నాలుగేళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్న అతడు వచ్చే సీజన్ నుంచి మొత్తం క్రికెట్ కే దూరం కానున్నాడు.

ఈ మ్యాచ్ జరిగితే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్‌ లో శనివారం బెంగళూరు చిన్నస్వామి మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లకూ ఇదే చివరిది. అయితే, గెలిస్తే చెన్నై నేరుగా ప్లేఆఫ్స్ చేరనుంది. బెంగళూరు మాత్రం గెలిచినా పలు సమీకరణాల ప్రకారమే ప్లే ఆఫ్స్ వెళ్లే వీలుంది. కాగా, ఈ సీజన్ తొలి మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యనే జరిగింది. మార్చి 22న జరిగి నాటి మ్యాచ్ లో బెంగళూరుపై చెన్నై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పుడు మరోసారి తలపడనున్నాయి.

మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైతే సీఎస్కే నాకౌట్‌ కు వెళ్లిపోతుంది. ఈక్రమంలో మరోసారి ధోనీతో ఆడటంపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీన్నిబట్టి ధోనీ ఆడబోయే చివరి సీజన్‌ ఇదేనా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంతకూ కోహ్లి ఏమన్నాడంటే..

‘‘మహీతో మరోసారి మ్యాచ్‌ ఆడబోతున్నా. నాకు తెలిసి ఇదే చివరిదేమో మేమిద్దరం ఆడటం. అతడు కొనసాగుతాడో? లేదో? అనేది ఎవరికి తెలుసు. తప్పకుండా ఇది అభిమానులకు అద్భుత అనుభూతి. మేం భారత్‌ తరఫున చాలా ఏళ్లు కలిసి ఆడాం. జట్టును ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.’’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

Tags:    

Similar News