బిగ్ ట్విస్ట్.. టీమ్ ఇండియా టి20, వన్డే కెప్టెన్ మార్పు?

భారత క్రికెట్ క్రింట్రోల్ బోర్డు (బీసీసీఐ), సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముగ్గురిని ఉటంకిస్తూ ఇంగ్లిష్ మీడియా ఈ కథనం రాసుకొచ్చింది

Update: 2025-02-07 17:30 GMT

భారత క్రికెట్ లో భారీ మార్పు..? టి20, వన్డే ఫార్మాట్లకు కెప్టెన్ మార్పు.. అది కూడా గత ఏడాది వరకు కెప్టెన్ గా చేసిన ఆటగాడికి సారథ్య పగ్గాలు..? నేషనల్ మీడియా కథనాల ప్రకారం వన్డే ఫార్మాట్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ను తప్పిస్తారట..? టి20లకు కూడా సూర్యకుమార్ యాదవ్ ను పక్కనపెడతరాట..? ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఈ రెండు ఫార్మాట్లకు కెప్టెన్ చేస్తారట..

భారత క్రికెట్ క్రింట్రోల్ బోర్డు (బీసీసీఐ), సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముగ్గురిని ఉటంకిస్తూ ఇంగ్లిష్ మీడియా ఈ కథనం రాసుకొచ్చింది. వాస్తవానికి రోహిత్ టెస్టుల్లో విఫలం అవుతున్నందున ఆ ఫార్మాట్ లో అతడిని తప్పించి యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ను సారథి చేస్తారని ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటన అనంతరం ఊహాగానాలు వచ్చాయి. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కూడా కథనాలు రాశారు. కానీ, ఇదేమీ జరగలేదు. జూన్ వరకు టెస్టులు లేనందున రోహిత్ ప్రకటన కూడా చేయనందున ఆ విషయం పక్కకుపోయింది.

వన్డేల నుంచి కూడా రోహిత్ తప్పుకొంటాడని ఓ దశలో అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఇంగ్లండ్ సిరీస్ తో పాటు చాంపియన్స్ ట్రోఫీకీ అతడినే కెప్టెన్ చేశారు. కాగా, గురువారం నాటి తొలి వన్డేలో రోహిత్ వైఫల్యం అతడి భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ సిరీస్, చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా, రోహిత్ ప్రదర్శనను చూసి అతడిని కొనసాగించే విషయమై నిర్ణయం తీసుకుంటారట.

హార్దిక్ ఆల్ రౌండర్ గా సమర్థంగా రాణిస్తున్నప్పటికీ అతడి అన్యాయం జరుగుతోందని గంభీర్, బీసీసీఐ భావిస్తున్నాయట. అందుకనే హార్దిక్ కు వన్డే, టి20 పగ్గాలు ఇవ్వాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. టి20లకు కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఇటీవలి ఇంగ్లండ్ తో సిరీస్ లో విఫలమ్యాడు. ఐదు మ్యాచ్ ల్లోనూ అతడు పరుగులే చేయలేదు. అందుకనే సూర్య బదులు హార్దిక్ ను కెప్టెన్ చేస్తారని అంటున్నారు.

వాస్తవానికి వన్డే ప్రపంచ కప్ తర్వాత టి20ల నుంచి రోహిత్ విరామం తీసుకోవడంతో హార్దిక్ ను కెప్టెన్ చేశారు. ఇంతలో రోహిత్ తిరిగి రావడంతో అతడిని ప్రపంచ కప్ కు కెప్టెన్ చేశారు. హార్దిక్ వైస్ కెప్టెన్ గా చేశాడు. రోహిత్ రిటైర్మెంట్ అనంతరం అనూహ్యంగా సూర్యను కెప్టెన్ చేశారు. ఆరు నెలలు కూడా గడవక ముందే ఇప్పుడు హార్దిక్ కు కెప్టెన్సీ అప్పగిస్తున్నారు.

Tags:    

Similar News