మైనర్ రేప్ చేసిన ఐపీఎల్ క్రికెటర్.. దోషిగా తేల్చిన కోర్టు
ఇంతకాలం ఆరోపణలతో కొంతకాలం జైల్లో ఉన్న ఇతడి పాపం పండింది. గత ఏడాది ఆగస్టులో ఖాట్మండులోని ఒక హోటల్ గదిలో సందీప్ తనపై రేప్ చేసినట్లుగా ఒక మైనర్ బాలిక కోర్టును ఆశ్రయించటం తెలిసిందే.
మైనర్ పై రేప్ చేసినట్లుగా ఐపీఎల్ క్రికెటర్.. నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గా సుపరిచితుడు సందీప్ లామిచ్చెన్ ను దోషిగా తేలుస్తూ కోర్టు స్పష్టం చేసింది. ఖాట్మండు జిల్లా కోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇంతకాలం ఆరోపణలతో కొంతకాలం జైల్లో ఉన్న ఇతడి పాపం పండింది. గత ఏడాది ఆగస్టులో ఖాట్మండులోని ఒక హోటల్ గదిలో సందీప్ తనపై రేప్ చేసినట్లుగా ఒక మైనర్ బాలిక కోర్టును ఆశ్రయించటం తెలిసిందే.
ఈ కేసులో సందీప్ ను అరెస్టు చేసిన పోలీసులు కొంతకాలం జైల్లో ఉంటారు. తాజాగా ఆ కేసు విచారణను ఖట్మాండు కోర్టు ముగిస్తూ.. అతడ్ని దోషిగా నిర్దారించింది. తదుపరి విచారణలో అతడికి శిక్షను ఖరారు చేస్తూ తీర్పును ఇవ్వనుంది. 23 ఏళ్ల ఈ నేపాలీ క్రికెటర్ ఐపీఎల్ లో ఆడిన తొలి నేపాలీ క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు.
ఐపీఎల్ తో పాటు.. బిగ్ బాష్ లీగ్.. కరీబియన్ ప్రీమియర్ లీగులతో పాటు వేర్వేరు ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహించిన ట్రాక్ రికార్డు ఉంది. అంతేకాదు.. నేపాల్ క్రికెటర్ గా సందీప్ కు మంచి పేరుంది. గ్రౌండ్ లో చక్కటి ఆటను ప్రదర్శిస్తే సరిపోదు కదా? బయట కూడా అత్యున్నత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి కదా? అందుకు భిన్నంగా ఇలాంటి దారుణ నేరాలు చేస్తే.. బయటకు రాకుండా ఉండదు కదా? అతడు చేసిన పాపిష్టపు పనికి అతని పాపం పండింది.