'బౌండరీని జరిపేశారు'.. సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై వివాదం

ఇప్పుడు కూడా అలాంటిదే ఓ ఫేక్ న్యూస్ టి20 ప్రపంచ కప్ గురించి బాగా ప్రచారంలో ఉంది.

Update: 2024-07-02 11:57 GMT

అత్యంత సాదాసీదాగా మొదలై.. హోరాహోరీగా ఫైనల్ తో ముగిసింది టి20 ప్రపంచ కప్. అందులోనూ భారత్ విజేతగా నిలవడంతో 150 కోట్ల మంది అభిమాలను ఆనందం అంతాఇంతా కాదు. అయితే, ప్రతి ప్రపంచ కప్ ఫైనల్ అనంతరం కొన్ని వివాదాలు వస్తాయి. అది కూడా ఓటమి పాలైన దేశం నుంచే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు 2003 వన్డే ప్రపంచ కప్ లో భారత్ పై కెప్టెన్ రికీ పాంటింగ్ అద్భుత సెంచరీతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అప్పట్లో పాంటింగ్ బ్యాట్ లో స్టీల్ పెట్టారని అందుకే అతడు చెలరేగి ఆడాడనే వదంతులు వచ్చాయి. 1996 ప్రపంచ కప్ లో హైదరాబాదీ అజహర్ సారథ్యంలోని భారత్ సెమీఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడింది. దీనిపై ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. కానీ, ఇవేమీ నిర్ధారణ కాలేదు. ఇప్పుడు కూడా అలాంటిదే ఓ ఫేక్ న్యూస్ టి20 ప్రపంచ కప్ గురించి బాగా ప్రచారంలో ఉంది.

అది కళ్లు చెదిరే క్యాచ్

శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్ లో 16 పరుగులు చేయాల్సిన స్థితిలో దక్షిణాఫ్రికా బ్యాటర్ మిల్లర్ కొట్టిన బంతిని లాంగాన్ లో భారత ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే రీతిలో పట్టిన సంగతి తెలిసేందే. అయితే, అది బౌండరీ లైన్ దగ్గర పట్టిన క్యాచ్ కావడం.. అందులోనూ బంతిని బౌండరీ ఇవతల అందుకుని బ్యాలెన్స్ కోసం పైకి విసిరి, తిరిగి వచ్చి పట్టాడు సూర్య. దీంతోనే వివాదం రేగుతోంది.

Read more!

ఏమిటీ వివాదం..?

సూర్య క్యాచ్ పై దక్షిణాఫ్రికా అభిమానులు నానా యాగీ చేస్తున్నారు. అసలే తొలిసారి ప్రపంచ కప్ ఫైనల్ చేరిన జట్టు కావడంతో వారి బాధ అంతా ఇంతా కాదు. దీంతో ఫైనల్ మ్యాచ్ పై ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వెదుకుతున్నారు. ఈ క్రమంలో సూర్య క్యాచ్ వారికి కనిపించింది. మిల్లర్ కొట్టిన షాట్ సిక్స్ అని చెబుతున్నారు. కానీ బౌండరీ లైన్‌ ను వెనక్కు నెట్టారని, ఈ మేరకు మార్క్‌ ను మైదానంలో చూడొచ్చని చెప్తున్నారు. మోసం గురూ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. భారత్‌ కు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే.. తమ జట్టు బ్యాటింగ్ సందర్భంగా బౌండరీ లైన్‌ని వెనక్కు జరిపారని విమర్శలు చేస్తున్నారు.

విశ్లేషకుడు ఏమంటున్నారు?

‘‘దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో బౌండరీ లైన్‌ ను ఏమాత్రం వెనక్కు జరపలేదు. మ్యాచ్ ప్రారంభానికి ముందే అది అక్కడ ఉంది. అయితే, పిచ్ మారినప్పుడు బౌండరీ లైన్‌ ను సర్దుబాటు చేయడం క్రికెట్‌ లో అత్యంత సహజం. ఇలాంటప్పుడు గత ప్లేస్‌ మెంట్ కారణంగా తెల్లటి గుర్తులు ఏర్పడతాయన్నారు. సూర్య క్యాచ్ చోటనేకాక గ్రౌండ్ చుట్టూ బౌండరీ లైన్‌ ను సరిచేసిన విషయం గుర్తుచేశాడు. ఇతర ప్రాంతాల్లోనూ తెల్లటి గుర్తులు ఉన్నాయని పేర్కొన్నాడు. అనవసర రాద్ధాంతం తగదని కోరాడు.

దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్, మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ కూడా ఇదే మాట చెబుతున్నాడు. సూర్య సరైన క్యాచే పట్టాడని తెలిపాడు. గేమ్ లో భాగంగానే బౌండరీ లైన్‌ ను వెనక్కు జరిపారు తప్ప.. దాంతో సూర్యకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. బౌండరీ కుషన్ ను తాకకుండానే సూర్య అద్భుత క్యాచ్ పట్టాడని పేర్కొన్నాడు. దీనిని మెచ్చుకోవాలని సూచించాడు.

పొలాక్, క్రికెట్ విశ్లేషకుడి వ్యాఖ్యలతో అసలే జరిగిందో తెలిసిపోయింది. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది.

Tags:    

Similar News

eac