సినిమా ఆపేసి.. కెప్టెన్ ఫోన్ తో బౌలర్లకు సినిమా చూపాడు
మూడు ఫార్మాట్లు.. టెస్టులు, వన్డేలు, టి20లలోనూ సమయోచితంగా ఆడగల బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. వన్డే ప్రపంచ కప్ నకు ముందు మూడు ఫార్మాట్లలోనూ అతడు సభ్యుడు.
వన్డే ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించినప్పటికీ ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో టీమ్ ఇండియాకు దూరమయ్యాడు అతడు.. తిరిగి జట్టుకు ఎంపికైనా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కడం కష్టమే అనే పరిస్థితి నెలకొంది. కానీ, ఓ అనూహ్యం పరిణామం అతడికి అవకాశం కల్పించింది.
మూడు ఫార్మాట్లు.. టెస్టులు, వన్డేలు, టి20లలోనూ సమయోచితంగా ఆడగల బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. వన్డే ప్రపంచ కప్ నకు ముందు మూడు ఫార్మాట్లలోనూ అతడు సభ్యుడు. కానీ, ఆ కప్ తర్వాత గాయం అని చెప్పి దేశవాళీల్లో ఆడకపోవడం, బీసీసీఐ ఆగ్రహానికి గురికావడంతో ఓ దశలో అతడి భవిష్యత్తే ప్రశ్నార్థకం అయింది. చివరకు అయ్యర్ ఏ ఫార్మాట్లోనూ సభ్యుడు కాకుండా పోయాడు. గత ఏడాది ఐపీఎల్ లో రాణించడంతో అతడికి మళ్లీ పిలుపు దక్కింది.
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ దూసుకురావడంతో అయ్యర్ కు టి20ల్లో చోటు గల్లంతైంది. ఇంగ్లండ్ తో సిరీస్ కు వన్డేలకు ఎంపిక చేసినా తుది జట్టులో అవకాశం కష్టమే అనే పరిస్థితి. ఇలాంటి సందర్భంలో స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి గాయపడడంతో అయ్యర్ కు తుది జట్టులో చాన్స్ దొరికింది. దీనిని అతడు రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు.
ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ త్వరగా పెవిలియన్ చేరడంతో అయ్యర్ (నాలుగో స్థానం)కు త్వరగా బ్యాటింగ్ దక్కింది. ఈ పరిస్థితుల్లో అతడు గనుక త్వరగా ఔటైతే జట్టు ఇబ్బందుల్లో పడేది. కానీ, జట్టు ఏం కోరుకుంటోందో అదే చేసి చూపాడు.చకచకా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డు పడిపోకుండా చూశాడు.
భీకర బౌలర్ జోఫ్రా ఆర్చర్ పై ఆధిపత్యం ప్రదర్శించాడు. లేదంటే జట్టు వెనుకబడేదే..? ఇక వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ తో మూడో వికెట్ కు 94 పరుగులు జోడించాడు. 36 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. ఇక్కడ విషయం ఏమంటే.. ముందుగా అనుకున్న తుది జట్టులో అయ్యర్ లేడట. ఎలాగూ ఖాళీనే కదా? అని బుధవారం రాత్రి అతడు సినిమా చూస్తూ కూర్చున్నాడట.. కానీ, రోహిత్ ఫోన్ చేసి.. కోహ్లికి మోకాలిలో వాపు వచ్చిందని.. అతడి స్థానంలో నిన్ను తీసుకుంటున్నామని చెప్పడంతో అయ్యర్ వెంటనే హోటల్ రూమ్ కు వెళ్లి నిద్రపోయాడట. ఈ నేపథ్యంలోనే తనకు ఈ విజయం, ఈ ఇన్నింగ్స్ రెండూ గుర్తుండిపోతాయన్నాడు. ఆసియా కప్ సందర్భంగా తన ప్లేస్ లోకి వచ్చిన ఆటగాడు సెంచరీ చేసిన సంగతిని అయ్యర్ గుర్తుచేసుకున్నడు. ఇదంతా ఆటలో సహజమేన్నాడు.
కొసమెరుపు: ‘ఏడాదిన్నర కిందట దేశవాళీలు ఆడనందుకు బీసీసీఐ ఆగ్రహానికి గురైన అయ్యర్.. ఇప్పుడు ‘‘గత దేశవాళీ సీజన్ మొత్తం ఆడా. ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లడం సహా చాలా పాఠాలు నేర్చుకున్నా. నా వైఖరిని మార్చుకోలేదు కానీ ఆడే విధానం మెరుగుపర్చుకున్నా’ అని అంటున్నాడు.