ఆ స్టార్ క్రికెటర్ ను కళ్లారా చూసేయండి.. రిటైరైతే కనిపించడట
భారత్ లో మూడే మూడు రంగాలు ప్రజల్లో ఆదరణ పొందుతుంటాయి.
భారత్ లో మూడే మూడు రంగాలు ప్రజల్లో ఆదరణ పొందుతుంటాయి. ఒకటి రాజకీయాలు, రెండు సినిమాలు, మూడు క్రీడలు. మరీ ముఖ్యంగా క్రికెట్. ఇక క్రీడలు, సినిమాల్లో విజయవంతమైన వారు తదుపరి లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెడుతుంటారు. కొందరు దిగ్గజ క్రీడాకారులు రిటైర్మెంట్ అనంతరం క్రీడాకారులు చాలామంది కామెంట్రీ చేయడమో, ఇంకా ఇతర వ్యాపకాల్లో కొనసాగడమో చేస్తుంటారు. కానీ, అత్యంత స్టార్ డమ్ సంపాదించిన ఈ క్రికెటర్ మాత్రం రిటైరయ్యాక ఇక మీకు కనిపించను అంటున్నాడు.
మూడు ఫార్మాట్లలోనూ మొనగాడు
సునీల్ గావస్కర్ టెస్టుల్లో దిగ్గజం.. సచిన్ టెండూల్కర్ టెస్టులు, వన్డేల్లో దిగ్గజం.. కానీ, టెస్టులు, వన్డేలతో పాటు నవతరం ఫార్మాట్ అయిన టి20ల్లోనూ దిగ్గజం ఎవరంటే మరో మాట లేకుండా వినిపించే పేరు విరాట్ కోహ్లి. 35 ఏళ్ల వయసులోనూ.. 17 సీజన్లుగా ఆడుతూ కూడా ప్రస్తుత ఐపీఎల్ లీగ్ లో కోహ్లి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీన్నిబట్టే అతడి అంకితభావాలన్ని అర్థం చేసుకోవచ్చు. 13 మ్యాచ్ లలో 661 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ గను ప్లే ఆఫ్స్ నకు వెళ్లిందంటే అది కోహ్లి కారణంగానే.
ఇక విరాట్ ఫిట్ నెస్ ప్రస్తుత క్రికెటర్లలో ఎవరికీ లేదంటే ఆశ్చర్యమే. నాలుగైదేళ్లు ఈజీగా అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగే చాన్సుంది. కానీ, తాను రిటైర్మెంట్ ప్రకటించాక ఇక ఎవరికీ
కనిపించనని అంటున్నాడు. అంతేకాదు. ఎప్పుడైనా సరే మ్యాచ్ ఆడిన తర్వాత.. ఎందుకు అలా ఆడానా? అని పశ్చాత్తాపం అనేది ఉండకూడదని వివరిస్తున్నాడు.
శాశ్వతంగా కనిపించడగా?
కోహ్లి రిటైర్మెంట్ అనంతరం శాశ్వతంగా కనిపించడా? అని అంటే.. కాదు.. చాన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించనని మాత్రమే చెబుతున్నాడు. తర్వాత ఏం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటానంటున్నాడు. మీడియాకూ కనిపించనని పేర్కొంటున్నాడు.
పిల్లలతో గడుపుతాడా?
కోహ్లి రిటైర్మెంట్ అనంతరం సమయాన్ని పిల్లలతో గడిపేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. కోహ్లి-అనుష్క శర్మ దంపతులకు కూతురు వామికా, కొడుకు అకాయ్ ఉన్న సంగతి తెలిసిందే.