స్క్విడ్ గేమ్ 3 లీక్.. ఆడియన్స్ కి దొరికిపోయిన నెట్ ఫ్లిక్స్..!

ఐతే ఓ పక్క స్క్విడ్ గేమ్ 2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంటే ఆడియన్స్ ని మరింత థ్రిల్ చేయాలనే ఉద్దేశంతో స్క్విడ్ గేమ్ 3 అప్డేట్ కూడా ఇచ్చింది నెట్ ఫ్లిక్స్.

Update: 2025-01-02 08:50 GMT

కొరియన్ వెబ్ సీరీస్ స్క్విడ్ గేమ్ కి ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీరీస్ మొదటి భాగం సంచలన విజయం అందుకుంది. ఆట ఆడండి అంటూ పిలిచి ఓడితే ఆటలోంచి తీసేయడం కాదు ప్రాణాలనే తీసేస్తూ కొందరు ఆడించే ఆట తెలిసిందే. స్క్విడ్ గేమ్ మొదటి సీజన్ అసలు ఏమాత్రం ఊహించని విధంగా సక్సెస్ అయ్యింది. ఐతే ఆ సీరీస్ రెండో సీజన్ గా రీసెంట్ గా స్క్విడ్ గేమ్ 2 వచ్చింది. ఐతే సీజన్ 1 కి వచ్చిన రేంజ్ లో స్క్విడ్ గేమ్ 2 కి పాజిటివ్ టాక్ రాలేదు. అయినా కూడా ఈ సీరీస్ కూడా నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంటూ వచ్చింది.

ఐతే ఓ పక్క స్క్విడ్ గేమ్ 2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంటే ఆడియన్స్ ని మరింత థ్రిల్ చేయాలనే ఉద్దేశంతో స్క్విడ్ గేమ్ 3 అప్డేట్ కూడా ఇచ్చింది నెట్ ఫ్లిక్స్. ఐతే స్క్విడ్ గేమ్ 3 ని కూడా ఈ ఇయర్ లో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. కానీ అందులో డేట్ కూడా లీక్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ యూట్యూబ్ లో స్క్విడ్ గేమ్ 3 డేట్ తో సహా ఇచ్చారు. అది చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. స్క్విడ్ గేమ్ 3 ని జూన్ 27 రిలీజ్ అని ప్రకటించారు.

ఐతే ఇది నెట్ ఫ్లిక్స్ తప్పిదం వల్ల అని తెలుస్తుంది. కేవలం ఈ ఇయర్ రిలీజ్ అన్న పోస్టర్ ఒకటే ఫైనల్ కాగా స్క్విడ్ గేమ్ 3 రిలీజ్ డేట్ ని అనుకోకుండా పొరపాటుగా వేశారట. ఐతే అప్పటికే నెట్ ఫ్లిక్స్ యూట్యూబ్ ఫాలోవర్స్ ఆ వీడియో చూశారు. స్క్విడ్ గేమ్ 3 జూన్ 27న రిలీజ్ అని సర్ ప్రైజ్ అవుతున్నారు. ఐతే నెట్ ఫ్లిక్స్ టీం యూట్యూబ్ నుంచి ఆ వీడియో డిలీట్ చేసింది. కానీ అప్పటికే తన సబ్ స్క్రైబర్స్ అందరికీ విషయం లీక్ అయ్యింది.

ఏది ఏమైనా స్క్విడ్ గేమ్ 3 ని ఇంత త్వరగా చూసే ఛాన్స్ ఉంటుందని ఆడియన్స్ అనుకోలేదు. ఐతే స్క్విడ్ గేమ్ 2 కన్నా స్క్విడ్ గేమ్ 3 ని ఇంకాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు లేటెస్ట్ గా స్క్విడ్ గేమ్ 3లో టైటానిక్ హీరో లియోనార్డో నటిస్తున్నాడన్న వార్తలపై కూడా స్క్విడ్ గేమ్ టీం అవన్నీ గాలి వార్తలే అన్నట్టుగా చెబుతుంది.

Tags:    

Similar News