ఆ మధ్య ప్రపంచంలో కరుడుగట్టిన టాప్ టెన్ క్రిమినల్స్ అని వెతికితే.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో రావటం.. దానిపై రచ్చ రచ్చ జరగటం.. చివరకు ఈ విషయం మీద ప్రముఖ సెర్చింజన్ గూగుల్ స్పందించి.. తప్పు జరిగిందని విచారం వ్యక్తం చేయటం తెలిసిందే. భవిష్యత్తులో అలా జరగకుండా చూస్తామని చెప్పటం తెలిసిందే.
తాజాగా.. మరోసారి గూగులమ్మ మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా చేసిందన్న వాదన వినిపిస్తోంది. గూగులమ్మ గూట్లోకి వెళ్లి.. ‘‘వరల్డ్స్ మోస్ట్ స్టుపిడ్ పీఎం’’ అని సెర్చ్ చేస్తే.. దాని రిజల్ట్ గా వస్తున్న ఫోటో ప్రధాని మోడీదే. దీనిపై పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తమవుతోంది. గూగులమ్మ ఏదో కక్ష కట్టినట్లుగా ఉందని కమలనాథులు తెగ ఫీలైపోతున్నారు.
ఒకటి తర్వాత ఒకటిగా మోడీ ఇమేజ్ ని బద్నాం చేసేలా ఎందుకు చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి.. తాజా ఉదంతంపై గూగుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.