ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ ఏమి స్పీడు గురూ!

Update: 2015-06-08 10:30 GMT

ఆన్ లైన్ లో పని చేసేప్పుడు నిత్యం ఎదుర్కొనే సమస్యం... "నెట్ స్లో"గా ఉంది! ఈ సమస్యం... కొన్ని సార్లు ఇబ్బంది పెడితే... మరి కొన్ని సార్లు పని నుండి తప్పించుకోవడానికి సహకరిస్తుంది! ఆ సంగతి పక్కన పెడితే... అసలు ఇంటర్నెట్ స్పీడ్ గా ఉండాలి, హైస్పీడ్ ఇంటర్నెట్ కావాలి, ఎంత పెద్ద ఫైల్ అయినా సులువుగా డౌన్ లోడ్ అయిపోవాలి! ఇటువంటి ఆలోచన, ఆశ అందరికీ ఉంటుంది! కొంత మందికి ఇంటర్నెట్ కనెక్షన్ హై స్పీడ్ ఉన్నా... వైరస్ వల్ల అది కాస్త మందగించిపోతుంది! ఈ క్రమంలో ఏఏ దేశాల్లో ఇంటర్నెట్ ఫుల్ స్పీడ్ గా ఉందా అని సర్వేచేస్తే... ఒక పది దేశాలు వేగవంతమైన ఇంటర్నెట్ వ్యవస్థను కలిగి ఉన్నాయని గుర్తించారు! వాటిలో దక్షిణ కొరియా ప్రథమ స్థానంలో నిలవగా... ఫిన్ ల్యాండ్ 10వ స్థానంలో నిలిచింది! అగ్రరాజ్యం అమెరికా ఈ విషయంలో వెనకబడే ఉంది! ఆ పది దేశాలు ఏవేవో.. వాటి పెరుగుదల ఏ మేరకు ఉందో ఇప్పుడు చూద్దాం...

దక్షిణ కొరియా: ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 22.2 శాతం. అయితే... గత ఏడాదితో పోలిస్తే 1.6 శాతం పెరుగుదల ఉంది!

హాంగ్ కాంగ్: ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 16.8 శాతం గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే 37 శాతం పెరగుదుల నమోదైంది!

జపాన్: ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 15.2 ఎంబీపీఎస్. గత ఏడాదితో పోలిస్తే పెరగుదుల 16 శాతం గా ఉంది!

స్విడెన్: ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 14.6 ఎంబీపీఎస్ కాగా... గత ఏడాదితో పోలిస్తే పెరగుదుల శాతం 34!

స్విట్జర్లాండ్: ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 14.5 ఎంబీపీఎస్. గత ఏడాదితో పోలిస్తే 21 శాతం పెరగుదులలో ఉంది.

నెదర్లాండ్స్: ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 14.2 ఎంబీపీఎస్. గత ఏడాదితో పోలిస్తే పెరగుదుల 15 శాతం!

లాట్వియా: ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 13 ఎంబీపీఎస్. గత ఏడాదితో పోలిస్తే పెరుగదల 25 శాతం.

ఐర్లాండ్: ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 12.3 ఎంబీపీఎస్. గత ఏడాదితో పోలిస్తే పెరుగదల 8.4 శాతం.

చెక్ రిపబ్లిక్: ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 12.3 ఎంబీపీఎస్. కాగా గత ఏడాదితో పోలిస్తే పెరుగదల శాతం 8.4!

ఫిన్‌ల్యాండ్: ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 12.1 ఎంబీపీఎస్. గత ఏడాదితో పోలిస్తే పెరుగదల 33శాతం.

Tags:    

Similar News