వారికి వరంగా గూగుల్ ​ గాగుల్స్

Update: 2015-07-27 04:13 GMT
మానసిక ఎదుగల లేకుండా చేసే ఆటిజంపై గూగుల్ యుద్ధం తలపెట్టిం​ది. మానసిక ఎదుగుదల లేని కారణంగా ఎదుటి వారి భావాల్ని గుర్తించలేని ఇలాంటి వారికి తోడ్పాటు అందించటంతో పాటు.. మిగిలిన వారి మాదిరి ఉండేలా చేయటానికి గూగుల్ సంస్థ సరికొత్త కసరత్తు మొదలు పెట్టింది.

ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా గాగుల్స్ ను గూగుల్ తయారు చేసింది. ఈ కళ్లద్దాల్లోని చిప్ సాయంతో ఎదుటివారి భావాల్ని అర్థం చేసుకునేలా సంకేతాల్ని మెదడుకు పంపుతుందని చెబుతున్నారు.ఇందుకోసం గూగుల్ గాగుల్స్ లో ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఒకటి ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఆటిజంతో బాధ పడే వారు సొంతంగా తమకు తాము ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి.

నిత్యం వారితో ఎవరో ఒకరు వెంట ఉండాల్సి ఉంటుంది. అలాంటి ఇబ్బంది లేకుండా గూగుల్ గ్లాసెస్ సాయం చేస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ గ్లాసెస్ ను గూగుల్ రూపొందించిందని.. అంతిమ పరీక్షల కోసం హార్వర్డ్  మెడికల్ స్కూల్లో వీటికి తుది పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అక్కడ కానీ.. గూగుల్ కళ్లాద్దాలు విజయవంతం అయితే.. ఆటిజంతో బాధ పడే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన గాగుల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తారని చెబుతున్నారు.
Tags:    

Similar News