ఐ ఫోన్లు.. ఐ ప్యాడ్ లకు.. సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను ఆవిష్కరించింది. బేటా వెర్షన్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చి కొత్త వెర్షన్ కు అప్ డేట్ అయ్యే వారికి ఎలాంటి అనుభవ ఉండబోతోందో... కొన్ని లీకుల ద్వారా తెలియ జేస్తోంది. ఐ ఆపరేటింగ్ సిస్టమ్ -9 లో ప్రధానంగా కీ బోర్డ్ సెట్టింగ్స్ మారుతున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా కీ బోర్డు సెట్టింగ్స్ కు సంబంధించి యూజర్లకు ఉన్న ఇబ్బందులను ఐఓఎస్ పరిష్కరిస్తోంది. ఇప్పటి వరకూ టెక్ట్స్ టైపింగ్ సమయంలో.. క్యాపిటల్ లెటర్స్ ను టైప్ చేయాలనుకొన్న ప్రతిసారీ షిఫ్ట్ కీని ప్రెస్ చేసుకోవాల్సి వచ్చేది.
పూర్తిగా ఇంగ్లిష్ క్యాపిటల్ లెటర్స్ లోనే టైప్ చేయాలనుకొంటే.. రెండు సార్లు షిఫ్ట్ కీని ప్రెస్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఇకపై ఆ అవసరం ఉండదు. టెక్ట్స్ టైపింగ్ సమయంలో ఒక్కసారి షిఫ్ట్ కీని ప్రెస్ చేసినా.. లెటర్స్ క్యాపిటలైజ్ అవుతాయి. మళ్లీ షిఫ్ట్ కీ కొట్టే వరకూ కూడా లెటర్లు పెద్దక్షరాలుగానే కనిపిస్తాయి. ఐఓఎస్ 9కి సంబందించి ప్రధానమైన మార్పు ఇదేనని తెలుస్తోంది. మిగతావి అన్ని చిన్న చిన్న ఆల్ట్రేషన్లేనని తెలుస్తోంది.
టెక్ట్స్ టైపింగ్ తీరు మారడమే ఐఓఎస్ డివైజ్ లు వాడుతున్న వారికి చాలా అనందాన్ని ఇస్తోంది. మిగతా మార్పుల విషయంలో ఇంకా రివ్యూలు రావాల్సి ఉంది. ఐఓఎస్ ఏడు, ఎనిమిది.. ఆ తర్వాతి అప్ డేటెడ్ ఓఎస్ లు వాడుతున్న వారు ఐఓఎస్ తొమ్మిదిని అప్ డేట్ చేసుకోవచ్చు. ఐఓఎస్ 6 దగ్గర ఆగిపోయిన వారికి మాత్రం కొత్త అప్ డేషన్లకు అవకాశం ఉండదు!