రోబో హోటల్ వచ్చేసింది

Update: 2015-07-20 05:51 GMT
ప్రపంచంలో ఇప్పటివరకూ ఉన్న హోటళ్లకు భిన్నమైన ఒక హోటల్ ఒకటి జపాన్ లో అందుబాటులోకి వచ్చేసింది. సరదాగా.. ప్రశాంతంగా ఖాళీ సమయాన్ని గడపటానికి.. రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేయటానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. మరి.. ఇలాంటి వారికి విచిత్రమైన అనుభూతిని అందించేందుకు రోబో హోటల్ ని ఏర్పాటు చేశారు.

‘‘హెన్ న’’ పేరిట ఏర్పాట్లు చేసిన ఈ హోటల్లోకి అడుగు పెట్టిన వెంటనే నవ్వుతూ పలుకరించే రిసెప్షెనిస్ట్ కనిపిస్తుంది. ఎంత అందంగా ఉందో అనుకునే లోపలే.. స్వాగతం పలికింది మనిషి కాదు.. రోబో అన్న విషయం తెలిసి ఆశ్చర్యచకితులు కావటం ఖాయం.

మనుషుల్ని తలపించేలా ఉండే హ్యోనో నాయిడ్ రోబోలతో హోటల్లో సరికొత్త అనుభూతి పక్కా. ఈ హోటళ్లలో డైనోసార్లు (రోబో) కనిపించి కనువిందు చేస్తాయి. ఇలాంటి హోటల్ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ రోబో హోటల్ లో ప్రత్యేకతలు కుప్పలు తెప్పలు అని చెబుతున్నారు. ఇక్కడ బస చేసే వారి రూమ్ లకు తాళాలు ఉండవు. కేవలం.. ముఖాన్ని గుర్తించటం ద్వారా లాక్ ఓపెన్ అయ్యే ఏర్పాటు చేశారు.

ఇక.. ఈ హోటల్లోని రెస్టారెంట్లలో ఫుడ్ పెద్దగా దొరకదు కానీ.. స్నాక్స్.. డ్రింక్స్ మాత్రం లభిస్తాయి. అయితే.. సెల్ప్ సర్వీసు. అలా అని అమ్మే వాళ్లు ఉంటారని అనుకుంటే పొరపడినట్లే. ఈ హోటల్  రెస్టాంరెంట్లో లభించే స్నాక్స్.. డ్రింక్స్ మొత్తం వెండింగ్ మెషిన్ ద్వారానే లభిస్తాయి. మనిషి అన్నది లేకుండా.. రోబోలతో నిర్వహించే ఈ హోటల్ లో కనిపించే మనుషులంతా ఆ హోటల్ కు అతిధులు మాత్రమే సుమా. భాగుంది కదూ.. ఈ హోటల్ కాన్సెప్ట్.
Tags:    

Similar News