నెక్స్ట్ యాపిల్ ఐఫోన్ లో ఫీచర్స్ ఇవేనా?

Update: 2015-06-08 10:32 GMT
యాపిల్ ప్రోడక్ట్స్ ఒక సారి వాడకం అలవాటయితే మరో బ్రాండుకు మారడం ఏమాత్రం సాధ్యంకాని పని అనే స్థాయిలో యాపిల్ ప్రోడక్ట్స్ పేరుసంపాదించుకున్నాయి! ఐఫోన్, ఐపాడ్, ఐపేడ్, నోట్ బుక్, స్మార్ట్ వాచ్ ఇలా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా... యాపిల్ యాపిలే అనే స్థాయిలో పేరు గడించింది! ప్రస్తుతం యాపిల్ 6ఎస్ వర్షన్ నడుస్తుంది. దీని తర్వాత వర్షన్ ఐఫోన్ విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికి... ఈ అప్‌కమింగ్ డివైజ్ గురించి అప్పుడే చర్చలు, ఊహాగానాలు, అంచనాలు మొదలైపోయాయి! ఐఫోన్ అంటే పిచ్చెక్కి పోయే రకం జనం అప్పుడే అప్ కమింగ్ ఐఫోన్ కోసం ఆన్ లైన్ వేదికగా చర్చలు చేసేస్తున్నారు, మరి కొంతమంది ఊహించి కొత్త ఫీచర్స్ చెప్పేస్తున్నారు! ఈ చర్చలకు సంబంధించిన ఆసక్తికరమైన రూమర్లు ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. రాబోయే ఐ ఫోన్ లో ఉండే విశేషాల రూమర్లు కొన్ని...

యాపిల్ తరువాతి వెర్షన్ ఐఫోన్... రోజ్ గోల్డ్ ఎడిషన్‌లో లభ్యమయ్యే అవకాశం ఉంది! దీనితో పాటు సరికొత్త డిజన్ తో అందుబాటులోకి రానుంది!

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్ 12 నుండి 16 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం కూడా ఉండబోతోంది!

2జీబి ర్యామ్, ఏ9 ప్రాసెసర్ ను కలిగి ఉండి... సఫ్రైర్ డిస్ ప్లే కలిగి ఉండే అవకాశం ఉంటుంది!

తరువాతి వర్షన్ ఐఫోన్ రూపకల్పనలో భాగంగా యాపిల్... భిన్నమైన కేసింగ్ మెటీరియల్స్ ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం!

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్‌లో మరిన్ని గెస్ట్యర్ కంట్రోల్ ఫీచర్లను చూసే అవకాశం.

యాపిల్ తరువాతి వెర్షన్ ఐఫోన్ లో... ఇప్పటికే యాపిల్ వాచ్ లో పొందుపరిచిన ఫోర్స్ టచ్ టెక్నాలజీతో ఇందులో కూడా లభ్యమయ్యే అవకాశం ఉంది!

ఇలా ఎవరికి తోచిన స్థాయిలో, ఎవరి ఊహల మేరకు వారు రాబోయే ఐఫోన్ గురించి ఆశలతో కూడిన అంచనాలు వేసేస్తున్నారు!

Tags:    

Similar News