రోబో మనిషిని చంపిన ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కొత్త చర్చకు తెరతీసింది. భవిష్యత్తంతా రోబోలు... టెక్నాలజీ కావడంతో ఇప్పుడు దానికి సంబంధించిన చట్టాలు మొదలైనవి రూపొందించాలన్న చర్చ జరుగుతోంది.
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో వోక్స్‌వాగన్ తయారీ ప్లాంట్‌లో ఓ కాంట్రాక్టర్‌ను రోబో చంపినట్టు ఆ కంపెనీ అధికారులు ప్రకటించారు. ఫ్రాంక్‌ఫర్ట్‌కు వంద కిలోమీటర్ల దూరంలో గల వోక్స్‌వాగన్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ (22) రోబోకు కొన్ని పరికరాలు అమర్చుతున్నాడు. ఆ సమయంలో రోబోని ఆపరేట్ చేసే వ్యక్తి వల్ల ఆ కాంట్రాక్టరును సమీపంలోని ఓ పెద్ద మెటల్ ప్లేట్ పైకి విసిరేసింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలుపాలైన ఆ కాంట్రాక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందని వోక్స్‌వాగన్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
అయితే... రోబో చేతిలో మనిషి హతమైన ఘటనల్లో ఇదే మొదటిదని చెబుతున్నారు. జర్మనీ పత్రికలు మాత్రం ఈ దుర్ఘనటలో రోబో దోషిగా తేలితే ఏయే శిక్షలు వేస్తారనే వార్తా కథనాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటి విషయంలో ఎలా వ్యవహరించాలన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది.