టెక్నాలజీ అడ్వాన్స్ అయిన తరువాత సౌలభ్యాలు ఎన్ని పెరిగాయో ఇబ్బందులూ అన్నే పెరిగాయి... కొత్తకొత్త టెక్నాలజీలు వినియోగిస్తున్నప్పుడు అజాగ్రత్తగా ఉంటే మొదటికే మోసమొస్తుంది. కొన్నాళ్లుగా ప్రపంచాన్ని ఊపేస్తున్న సెల్ఫీలూ అంతే ప్రమాదకరంగా మారుతున్నాయి. సెల్‌ఫోన్లలో కెమేరాలు రావడంతోనే ఎన్నో అవలక్షణాలు పుట్టుకొచ్చాయి.. ఆ కెమేరా కాస్త ఫోన్ ముందుభాగానికి కూడా వచ్చేయడంతో సెల్ఫీల సరదా మొదలైంది.. ఎక్కడికెళ్లినా, ఏ పని చేసినా ఓ సెల్ఫీ దిగడం.. సోషల్ మీడియా వెబ్‌సైట్లలో పెట్టేయడం ఫ్యాసనైపోయింది. అయితే... సెల్ఫీలు దిగేటప్పుడు అజాగ్రత్తగా ఉంటూ చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
ఇటీవల కాలంలో సెల్ఫీలు తీసకుంటూ యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. అయినా వారిలో మార్పు మాత్రం రావడంలేదు... ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీ మరణాలు పెరిగిపోయాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓ యువకుడు ఆగి ఉన్న రైలింజన్ పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు.. అయితే అక్కడ విద్యుత్ తీగలు ఉండడంతో వాటికి తగిలి చనిపోయాడు... సెల్ఫీ సందడిలో పడి భవనాలపై నుంచి కిందకు పడినవారు... రోడ్లపై యాక్సికెంట్లలో చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది.
తాజాగా రష్యాలో అన్నా కృపనికోవా అనే ఇరవయ్యేళ్ల అమ్మాయి ఓ వంతెనపై సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించింది. అయితే... సెల్ఫీ సందడిలో పడి బ్రిడ్జి అంచులవరకు వెళ్లి ప్రమాదవశాత్తు 40 అడుగుల లోతులో పడిపోయింది... దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ప్రాణాలు విడిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇలా సెల్ఫీ దిగే ప్రయత్నంలో వివిధ కారణాల వల్ల చనిపోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇది మరింత అధికమైతే స్మార్టుఫోన్లకు ఫ్రంట్ కెమేరా తీసేయాల్సిన పరిస్థితి వస్తుందేమో మరి. పరిస్థితి ఇలాగే కొనసాగితే సెల్ఫీ అనేది సూసైడ్‌కు మారుపేరుగా మారుతుందేమో.