కంప్యూటర్ స్లోగా మారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Update: 2015-06-08 10:53 GMT
ఏమిటి సమస్య? కంప్యూటర్ చాలా స్లోగా ఉంది! ఫార్మెట్ చేయించు మరి!! సరే... !!! చాలా మందికి ఇటువంటి సమస్య వస్తుంటుంది... ఇవే సమాధానాలు కూడా దొరుకుతాయి! కానీ... కంప్యూటర్ కు ముందునుండీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫార్మెట్ వంటి పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి! దాంతో పాటు సిస్టం ఎప్పుడూ స్లో అవ్వకుండా ఉంటుంది! ఆ జాగ్రత్తలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం...

 పీసీ డెస్క్‌టాప్‌ను ఎప్పుడూ వీలైనంత వరకు క్లీన్‌గా ఉంచాలి. యానిమేటెడ్ వాల్ పేపర్లు, స్ర్ర్కీన్ పేపర్లు, హై రిజల్యూషన్ వాల్ పేపర్స్ పెట్టకపోవడం మంచిది! ఇవి కంప్యూటర్ వేగాన్ని పూర్తిగా తగ్గిస్తాయి!

వీలైనప్పుడల్లా బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేస్తుండాలి! కుప్పలు కుప్పలుగా హిస్టరీ పేరుకుపోతే... సిస్టం చలా స్లోగా రన్ అయ్యే అవకాశం ఉంది! ఇంటర్నెట్ బ్రౌజింగ్ పూర్తి అయిన వెంటనే బ్రౌజింగ్ హిస్టరీతో పాటు కుకీలసు డిలీట్ చేయాలి!

అవస్రం లేని ప్రోగ్రామ్‌లను సి డ్రవి లో అలానే ఉంచడం మంచిది కాదు! అలా అనవసర ప్రోగ్రామ్‌లను పీసీ నుంచి తొలిగించకపోవటం కూడా కంప్యూటర్ నెమ్మదించటానికి ఒక ప్రధాన కారణంగానే చెప్పొచ్చు! కాబట్టి... అవసరమైనంత మేరకు మాత్రమే ప్రోగ్రాంస్ ని ఉంచుకుని... మిగిలినవి అన్-ఇన్‌స్టాల్ చేయాలి!

సీ డ్రైవ్, ఆపరేటింగ్ సిస్టం (ఓఎస్) పై ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల కంప్యూటర్ వేగం మందగిస్తుంది! కాబట్టి వీలైనంత వరకూ ఈ రెండింటి పై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి.

పాత సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగించటం వల్ల కూడా కంప్యూటర్ స్లోగా రన్ అవ్వొచ్చు! అందుకోసం ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ చేస్తుండటం మంచిది!

విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేయడం కోసం మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు ప్రవేశ పెట్టే అప్‌డేట్‌లను అప్ దేట్ చేసుకుంటే పీసీ పనితీరును మరింత మెరుగుపడుతుంది.

ఇదే సమయంలో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. నిత్యం కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొస్తుంటాయి కాబట్టి... ఎప్పటికప్పుడు యాంటీ వైరస్ లు అప్ డేట్ చేసుకోవాలి!

పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ... పెద్దగా పట్టించుకోని మరో విషయం రీసైకిల్ బిన్! డిలీట్ చేసిన ప్రతీ అనవసరమైన ఫైల్ ఇందులో ఉంటుంది కాబట్టి... నిర్లక్యం చేయకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడుతుంది!

ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే... కంప్యూటర్ కు అనారోగ్యం రాకుండా చుసుకోవచ్చు!

Tags:    

Similar News