ఐ ఫోన్ స్థాయి ఫీచర్స్ ను అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకొచ్చిన చైనా స్మార్ట్ ఫోన్ షియోమీ ఇంత వరకూ భారత్ మార్కెట్ లో సృష్టించిన సంచనాల సంగతి తెలిసిందే. అమ్మకాల విషయంలో షియోమీ ఫోన్లకు ఎనలేని క్రేజ్ కనిపించింది.ఆప్ లైన్ అమ్మకాల జాడే లేకుండా.. ఆన్ లైన్ లో అమ్మకాలకు పెట్టిన మరు నిమిషంలో వేలకు వేల పీస్ లు సేల్ అయ్యాయి. షియోమీ స్మార్ట్ ఫోన్స్ ను ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవడానికి జనాలు వెర్రి వెర్రి గా ప్రయత్నాలు చేశారు. షియోమీ ఎమ్ త్రీ దగ్గర నుంచినే ఆ క్రేజీనెస్ కనిపించింది.
ప్రస్తుతానికి అయితే ఆ క్రేజీనెస్ కొంత తగ్గుముఖం పట్టింది కానీ.. డిమాండ్ అయితే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్ తో సిద్ధం అయ్యింది. సరికొత్త డెవలప్ మెంట్స్ తో ఈ చైనీ సంస్థ ఎమ్ ఐ ఫైవ్ ను తెరపైకి తీసుకొస్తోంది. ఈ నెల పదహారవ తేదీన చైనాలో ఈ స్మార్ట్ ఫోన్ లో ని ఫీచర్స్ ను ఆవిష్కరించే టీజర్ ను విడుదల చేయబోతున్నారు.
షియోమీ ఎమ్ఐ5 తో పాటు ఒకేసారి ఎమ్ ఐ ఫైవ్ ప్లస్ కు సంబంధించిన వివరాలు కూడా పదహారో తేదీన వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయనే అంశం గురించి.. ఇంకా పూర్తి వివరాలు తెలీవు. టీజర్ వీడియో విడుదల అయితే కానీ ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కొన్ని లీకులు మాత్రం ఇప్పటికే మీడియాలోకి వచ్చాయి. 5.2 ఇంచెస్ డిస్ ప్లేతో గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ తో ఈ ఫోన్ అదిరిపోయే లుక్ లో ఉంటుందని మాత్రం అంటున్నారు. 16 ఎమ్ పీ రేర్ కెమెరా, 13 ఎమ్ పీ ఫ్రంట్ క్యామ్ తో ఆకట్టుకొంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఇది భారత మార్కెట్ లో ఎంత వరకూ సత్తా చాటుతుందో చూడాలి!