ఇక.. యూట్యూబ్ లో త్రీడీ ఎఫెక్ట్

Update: 2015-07-25 05:08 GMT
ఇక.. యూట్యూబ్ లో త్రీడీ ఎఫెక్ట్
  • whatsapp icon
గూగలమ్మ ఎంత ఫేమస్సో.. నెట్ ప్రపంచంలో యూట్యూబ్ అంతే సుపరిచితం. కోరుకున్న వీడియో ఏదైనా సరే.. అందించే యూట్యూబ్ లో సెర్చ్ లో కొట్టాలే కానీ.. వెంటనే సదరు వీడియోలు.. అందుకు సంబంధిత వీడియోలు బోలెడన్ని వచ్చి పడతాయి.

సాదాసీదా వీడియోలు మొదలు.. ఫుల్ హెచ్ డీ ఎఫెక్ట్ తో ఉన్న వీడీయోల్ని నెటిజన్లకు అందిస్తున్న యూట్యూబ్.. త్వరలో మరో కొత్త అనుభూతిని ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటివరకూ 2డీ వీడియోలను అందించిన యూట్యూబ్.. త్వరలో త్రీడీ ఎఫెక్ట్ లోనూ వీడియోల్ని అందించనుందని చెబుతున్నారు.

ప్రపంచం వ్యాప్తంగా త్రీడీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. వీఆర్ యూట్యూబ్ త్రీడీ వీడియోస్ పేరిట కొత్త యాప్ ని అండ్రాయిడ్ ఫోన్లలో యూట్యూబ్ విడుదల చేయనుందని చెబుతున్నారు. ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన వెంటనే.. త్రీడీ ఎఫెక్ట్ లో వీడియోలు చూసే వీలుందని చెబుతున్నారు. ఈ సదుపాయం కానీ అందుబాటులోకి వస్తే.. యూట్యూబ్ లో త్రీడీ ఎఫెక్ట్ తో వీడియోలే వీడియోలన్న మాట.
Tags:    

Similar News