గాండివధారి టీజర్.. యాక్షన్ గట్టిగానే ఉంది కాని..

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. స్పై యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెవర్ బిఫోర్ అనే క్యారెక్టర్ తో కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది.

Update: 2023-07-24 05:09 GMT

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. స్పై యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెవర్ బిఫోర్ అనే క్యారెక్టర్ తో కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది. ఇంతకుముందు వరుణ్ తేజ్ ఒక సైనికుడిగా సైంటిస్ట్ గా అలాగే ఒక మంచి లవర్ బాయ్ పాత్రలలో బాగానే మెప్పించాడు. ఇక అతను ఫుల్ యాక్షన్ బ్యాగ్రౌండ్ లో ఒక సినిమా చేయలేదు.

ఇప్పుడు గాండివధారి అర్జున సినిమాతో యాక్షన్ ప్రియులను ఆకట్టుకోవాలి అని వరుణ్ తేజ్ బాగానే హార్డ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి సినిమాకు సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. ఒక ఎమెర్జెన్సీ పరిస్థితులలో టార్గెట్ అయిన వ్యక్తి కోసం ఆఫీసర్లు అర్జున్ ని రంగంలోకి దింపడం.. ఇక అతనితో కలిసి వర్క్ చేయడానికి హీరోయిన్ రాగా.. అనంతరం అతనితో సెట్టవ్వడం లేదని చెప్పడం చాలా రెగ్యులర్ గానే ఉంది. ఇక ఆ తరువాత మళ్ళీ రొమాన్స్ అనేది ఉహించదగిందే.

ఇక సినిమాలో యాక్షన్ ఎలివేషన్స్ మాత్రం గట్టిగానే ఉండబోతున్నట్లు కొన్ని షాట్స్ అయితే బాగానే హైలెట్ చేశారు. సీక్రెట్ గా లక్షల కోట్ల వ్యాపారం చుట్టూ జరిగే స్కామ్ కూడా హైలెట్ చేశారు. ఇక వరుణ్ తేజ్ అయితే హాలీవుడ్ హీరోల తరహాలో ఎక్కువగా యాక్షన్ లుక్ తోనే కనిపిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు హాలీవుడ్ తరహాలోనే చేసింగ్ సీక్వెన్స్ లు, బ్లాస్టింగ్ సీన్స్ ను, హై లెవెల్ స్కామ్స్ ను టచ్ చేసినట్లు అర్ధమవుతోంది.

యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగానే హైలెట్ అయ్యాయి. ప్రవీణ్ సత్తారు ఇదివరకే ఈ తరహా కాన్సెప్ట్లను బాగానే టచ్ చేశాడు. గరుడవవేగ సినిమాతో పాటు ఆ తర్వాత నాగార్జునతో చేసిన ది ఘోస్ట్ లో కూడా హాలీవుడ్ తరహా కలరింగ్ ఇచ్చాడు. కానీ అవేవి అంతగా అంచనాలును అందుకోలేదు. ముఖ్యంగా ది ఘోస్ట్ అయితే దారుణంగా డిజాస్టర్ అయ్యింది.

ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ తో గాండివదారి అర్జున సినిమాతో మరేదో కొత్తగా టచ్ చేసినట్లు అర్ధమవుతోంది. కానీ ఈ తరహా స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ కు ఈ మధ్య కాలంలో సక్సెస్ రేటు చాలా తక్కువగానే ఉంది. రా అండ్ రస్టిక్ కాన్సెప్ట్ లతో అందరూ సినిమాలు చేస్తున్న తరుణంలో వరుణ్ తేజ్ ఈ తరహాలో ఎదో కొత్తగా ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక సినిమాలో ఏజెంట్ పాప సాక్షికి కథలో కీలకంగా ఉండే పాత్ర లభించినట్లు తెలుస్తోంది. ఇక టీజర్ అయితే బాగానే ఉంది కాని మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఆగస్టు 25న సినిమాను విడుదల చేయబోతున్నారు.


Full View


Tags:    

Similar News