లోకేశ్ మార్క్ యాక్షన్.. వైల్డ్‌గా లియో ట్రైలర్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ - విక్రమ్ ఫేమ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'లియో'.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ - విక్రమ్ ఫేమ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'లియో'. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా లియో ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ ప్రచార చిత్రం ఆద్యంతం.. లియోదాస్ అండ్ పార్దిగా విజయ్ యాక్టింగ్, ఆయనపై షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ హై ఓల్టేజ్‌లో ఉన్నాయి. ఇక అర్జున్ పై షూట్ చేసిన సీన్స్ కూడా ఆకట్టుకునే రేంజ్లో ఉన్నాయి. ముఖ్యంగా అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.
"సీరియల్ కిల్లర్ నడిరోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు.. ఆల్రెడీ రోడ్డు మీద చాలా మంది చనిపోయారు. వాడు చాలా క్రూరుడు.. వాడు అందరిని కాలుస్తున్నాడు.. అప్పుడు దైర్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ సింహంలా వచ్చి ఆ సీరియల్ కిల్లర్‌ను కాల్చాడు. ఇప్పుడు ఆ ఆఫీసర్ కాల్చిన గన్.. నీ చేతిలో ఉంది.." అంటూ విజయ్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది.
ఈ వాయిస్ ఓవర్ ప్లే అవుతుండగానే యాక్షన్ సీన్స్‌ను అద్భుతంగా చూపించారు. ఆ తర్వాత కిల్లర్‌ను చంపింది పార్దీ(విజయ్) అనుకుని విలన్స్ అతడిని, అతడి కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నించడం, వారి నుంచి పార్ది తప్పించుకోని తిరగడం, ఆ తర్వాత చేసేదేమి లేక తిరగబడటం చూపించారు. అయితే కిల్లర్‌ను చంపింది తాను కాదని, తనలా ఉన్న మరోడని పార్దీ చెప్పడం, అంతలోనే వైల్డ్‌గా ఉన్న లియోదాస్( మరో విజయ్)ను చూపించడం అంతా పవర్ ఫుల్‌గా సాగింది.
అసలు ఈ లియో ఎవరు.. ? ఎందుకు సీరియల్ కిల్లర్‌ను చంపాడు. లియో, పార్దీ ఇద్దరు ఒకేలా ఎందుకు ఉన్నారు? లేదా ఇద్దరు ఒకటేనా తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.