కరోనా నిర్దారణకు పలు రకాలు టెస్టులు ఉండటం తెలిసిందే. తొలుత ప్రభుత్వమే వీటిని ఉచితంగా పరీక్షలు చేసేది. తర్వాతి కాలంలో ప్రైవేట్ ల్యాబ్ లకు నిర్దారణ పరీక్షలు చేసేందుకు అనుమతులు ఇవ్వటం.. ఈ సందర్భంగా కొన్ని ధరల్ని ఫిక్స్ చేయటం తెలిసిందే. కిట్ల ధరలు భారీగా ఉన్న వేళ.. ప్రభుత్వం చెప్పిన ధరల్ని.. ఇప్పటికి అలానే వసూలు చేస్తున్నాయి ప్రైవేటు ల్యాబ్ లు. పక్కనున్న ఏపీలో నిర్దారణ పరీక్షల ధరల్నిభారీగా తగ్గించేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. తెలంగాణలో మాత్రం అలాంటిదేమీ కనిపించని పరిస్థితి.
మొదట్లో కరోనా నిర్దారణ పరీక్షల కిట్ల ధరలు భారీగా ఉండేవి. దీనికి తగ్గట్లే పరీక్షల ధరల్ని ఫిక్స్ చేశారు. కిట్ల ఉత్పత్తి భారీగా పెరిగిన నేపథ్యంలో.. కిట్ల ధరలు పెద్ద ఎత్తున తగ్గిపోయాయి. మొదట్లోఈ కిట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. తర్వాతి కాలంలో దేశీయంగానే ఉత్పత్తి చేస్తున్నారు. మొదట్లో ఆర్టీపీసీఆర్ కిట్ ధర రూ.4500 ఉండేది. ఇప్పుడు అది కాస్తా రూ.250లకే అందుబాటులోకి వచ్చింది. యాంటీజెన్ కిట్ ధర మొదట్లో రూ.504 ఉంటే ఇప్పుడు 275కు తగ్గిపోయింది.
కిట్ల ధరలు భారీగా తగ్గిపోయిన వేళ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా నిర్దారణ పరీక్ష ధరల్ని తగ్గిస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకుంటే రూ.950 మాత్రమే వసూలు చేయాలని ప్రైవేటు ల్యాబులకు ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు భిన్నంగా తెలంగాణలో ఇప్పటికి ఇదే టెస్టుల కోసం రూ.2200 వసూలు చేస్తున్నారు. అదే.. పరీక్షను ఇంటికి వచ్చి చేస్తే రూ.2800 వసూలు చేయటం గమనార్హం. ఏపీలో జగన్ సర్కారు చేయగలిగింది.. తెలంగాణలో కేసీఆర్ సర్కారు చేయకపోవటం ఏమిటి? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిజమే..సారు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోనట్లు?