ఏ సినిమాకైనా ఇంట్రో సీన్ చాలా కీలకం. అది పాజిటివ్ ఫీల్ ఇస్తే.. ఆ తర్వాత సానుకూల దృక్పథంతో సినిమా చూస్తాం. అలా అని ఇంట్రడక్షణ్ సీన్ అదరగొట్టేసి.. ఆ తర్వాతి ఎపిసోడ్లను తేల్చి పడేస్తే కష్టం. మాస్ సినిమాల్లో చాలా వరకు ఇలాగే జరుగుతుంటుంది. పెద్ద బిల్డప్‌తో లీడ్ క్యారెక్టర్‌ను పరిచయం చేసి.. ఆతర్వాతి సన్నివేశాల్లో దాన్ని నేల మీదికి దించేస్తుంటారు. ఈసారి వేసవి సీజన్లో తెలుగు సినిమా పరిస్థితి ఇలాగే తయారవుతోంది.
ఈ ఏడాది ‘దసరా’ సినిమాతో సమ్మర్ సీజన్ మొదలైంది. మార్చి నెలాఖర్లో వచ్చిన ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సమ్మర్లో భారీ చిత్రాలు లేని లోటును ‘దసరా’ తీర్చినట్లే కనిపించింది. పెద్ద సినిమాల స్థాయిలోనే దానికి ఓపెనింగ్స్ వచ్చాయి. ఆంధ్రా ప్రాంతంలో అండర్ పెర్ఫామ్ చేసినా.. ఓవరాల్‌గా ఈ సినిమా సంతృప్తికర ఫలితాన్నే ఇచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాల మీద, బాక్సాఫీస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే కథ రివర్సవుతోంది.
‘దసరా’ తర్వాతి వారం వచ్చిన రవితేజ క్రేజీ మూవీ ‘రావణాసుర’ వీకెండ్లోనే సత్తా చాటలేకపోయింది. యావరేజ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్ తర్వాత వాషౌట్ అయిపోయిన పరిస్థితి. ఇక దీంతో పాటుగా వచ్చిన ‘మీటర్’ సినిమా గురించి మాట్టాడుకోవడానికి ఏమీ లేదు. కాగా ఈ వారం ఒకటికి మూడు చిత్రాలు రిలీజయ్యాయి. అందులో అందరి దృష్టినీ ఆకర్షించింది సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమానే. ఆ చిత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ చూసి నిర్మాతలు, బయ్యర్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోవడంతో సినిమా కోలుకోవడం కష్టంగానే ఉంది. దీంతో పాటుగా రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. అందులో ‘రుద్రుడు’ చూసి జనాలు హాహాకారాలు చేస్తున్నారు. ‘విడుదల’ మంచి సినిమానే అయినా మరీ హార్డ్ హిట్టింగ్‌గా ఉండటంతో తెలుగులో సక్సెస్ కావడం కష్టంగానే కనిపిస్తోంది. మొత్తానికి ‘దసరా’ తర్వాత రెండు వారాలూ తీవ్ర నిరాశ తప్పలేదు. రాబోయే వారాల్లో రిలీజ్ కానున్న విరూపాక్ష, ఏజెంట్, పొన్నియన్ సెల్వన్-2, రామబాణం సినిమాలకు కూడా ఆశించిన స్థాయిలో బజ్ అయితే లేదు. మరి అవి ప్రేక్షకులను ఏమేర మెప్పించి, ఎలాంటి ఫలితాన్నందుకుంటాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.