అమరావతిలో జగన్ శంఖారావం

ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటాయపాలెంలో నిర్వహించే సభలో జగన్ ప్రసంగిస్తారు అని అంటున్నారు.

Update: 2023-07-22 14:43 GMT

ఏపీ సీఎం జగన్ ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. మూడు రాజధానుల సమస్యకు ఇప్పట్లో మోక్షం కనిపించకపోవడంతో ఆయన 2024 ఎన్నికల కోసం తనదైన శైలిలో పార్టీని విజయపధంలో నడిపించేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజానీకం మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు.

ఇదిలా ఉండగా జూన్ నెలలో అమరావతి పరిధిలోని సీఆర్డీఏ పరిధిలో యాభై వేల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసి విపక్షాలకు షాక్ ఇచ్చిన జగన్ ఇపుడు మరో అడుగు ముందుకు వేస్తున్నారు. ఈ నెల 24న ఆయన అమరావతిలో ఈ మొత్తం యాభై వేల ఇళ్ల పట్టాదారులకు ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు అతి పెద్ద గృహ సముదాయానికి క్రిష్ణాయపాలెంలో భూమి పూజ చేయనున్నారు.

ఇందుకోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. పట్టాలు అందుకున్న లబ్దిదారులు అంతా తరలిరావాలని ఇంటింటికీ వాలంటీర్లు, డ్వాక్రా మహిళలు వెళ్ళి బొట్టు పెట్టి మరీ వారిని ఆహ్వానిస్తున్నారు. ఇక అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటాయపాలెంలో నిర్వహించే సభలో జగన్ ప్రసంగిస్తారు అని అంటున్నారు. ఆ సభలో జగన్ అమరావతి గురించి ఏమి చెప్పబోతున్నారు అన్నది ఇపుడు చర్చగా ఉంది. అదే సందర్భంలో ఆయన ఏపీలోని విపక్షాలను మరో మారు గట్టిగా అటాక్ చేయనున్నారు అని అంటున్నారు. నిన్నటికి నిన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జగన్ విపక్షాల మీద డోస్ పెంచేసారు.

ఇపుడు దానికి మరింత అన్నట్లుగా అమరావతి నడిబొడ్డున జగన్ ఇచ్చే సందేశం ఏమిటి అన్నది కూడా అందరిలో ఆసక్తిని పెంచుతోంది. మరో వైపు చూస్తే ఎన్నికలు వచ్చేలోగానే అమరావతిలో లబ్దిదారులకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్న పట్టుదలతో వైసీపీ ప్రభుత్వం ఉంది.

అలా యభై వేల మంది లబ్దిదారులు వారి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపి మొత్తం రెండు లక్షల ఓట్లు ఉంటాయని అవి అమరావతి పరిధిలోని నాలుగైదు నియోజకవర్గాలలో కవర్ అవుతాయని. అలా గెలుపు అవకాశాలు వైసీపీకి పెరుగుతాయని అంటున్నారు. ఇంకో వైపు అమరావతి రాజధాని అభివృద్ధికి కూడా వైసీపీ ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది అని అంటున్నారు.

ఏది ఏమైనా బహుముఖ వ్యూహంతోనే రాజధాని విషయంలో జగన్ సర్కార్ ముందుకు అడుగులు వేస్తోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు ఎలాంటి చాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశ్యంతోనే వైసీపీ దూకుడు చేస్తోంది అని అంటున్నారు. ఇపుడు అందరి చూపూ అమరావతిలో జగన్ పర్యటన మీద ఆయన స్పీచ్ మీదనే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News