మార్పువైపే మెజారిటీ మొగ్గు... పవన్‌కు వినతులు..!
మొత్తంగా టికెట్ల విషయంలో చాలానే సూచనలు వచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
జనసేన అధినేత పవన్‌కు పలు వర్గాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఆయనను ముఖ్యమం త్రిగా చూడాలని కోరుకునేవారి నుంచి ఆయన గెలుపు గుర్రం ఎక్కాలని భావిస్తున్న అభిమానుల వరకు కూడా అందరూ కొన్ని సూచనలు, సలహాలు ఇస్తూ.. పార్టీ కార్యాలయానికి లేఖలు సంధిస్తున్నారు. ప్రధానంగా రెండు విషయాలపై వారు సూచనలు చేయడం గమనార్హం. 1) వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, 2) వలంటీర్ వ్యవస్థ. ఈ రెండు విషయాలపైనా అనేక మంది సూచనలు చేస్తున్నారు.
ముఖ్యంగా కాపు నాయకులు, అదేసమయంలో సీనియర్లు కూడా.. పవన్‌కు కొన్ని సూచనలు చేస్తున్నారు. హరిరామజోగయ్య వంటివారు కూడా.. వలంటీర్ల విషయంలో కొన్ని సూచనలు చేశారు. ఇక, పార్టీ అభిమా నుల విషయానికి వస్తే.. ఎంపిక చేసే అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేయాలని చెబుతున్నారు.
ప్రజా బలం ఉన్ననేపథ్యమే కాకుండా.. విద్యా విషయాలను, బ్యాక్ గ్రౌండ్‌ను కూడా పరిశీలించాలని సూచిస్తు న్నారు. పార్టీపై అంకిత భావంతో ఉన్న నాయకులను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా ముందుకు సాగాలని కూడా చెబుతున్నారు. గత ఎన్నిక ల్లో పార్టీ తరఫున గెలిచి వేరే పార్టీలోకి జంప్ చేసినట్టుగా ఉండే నాయకులకు అస్సలు అవకాశం ఇవ్వొద్దని కూడా సూచనలు వస్తున్నాయి.
అదే సమయంలో పార్టీలో ఓడిపోయిన చాలా మంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇలాంటివారికి కూడా ఇవ్వొద్దనేది మెజారిటీ అభిప్రాయంగా ఉంది. మొత్తంగా టికెట్ల విషయంలో చాలానే సూచనలు వచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇక, జోగయ్య విషయానికివస్తే.. ఆయన వలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టక పోయినా.. వలంటీర్ వ్యవస్థ ఉండాలని గట్టిగా నే సూచించారు. ప్రజలతో మమేకం అయిపోయిన.. వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని.. ఈ విషయాన్ని పవన్ చెప్పాలని ఆయన సూచించారు.
అంతేకాదు..ఈ వ్యవస్థను మరింత పారదర్శకంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. మొత్తానికి జనసేనకు అభిమానులు, కార్యకర్తలు, మేధావుల నుంచిఅనేక సూచనలు అయితే.. వస్తున్నాయి. మరి వేటిని పవన్ అమలు చేస్తారో చూడాలి.