లోకేష్... మా ఆవిడ తిడుతోంది.. ఏం చేయను: వైసీపీ ఎమ్మెల్యే సిల్లీ కామెంట్స్
చిన్నప్పుడు స్కూల్లో బలపం పోగొట్టుకున్న స్టూడెంట్ మాదిరిగా తయారైందట వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి
చిన్నప్పుడు స్కూల్లో బలపం పోగొట్టుకున్న స్టూడెంట్ మాదిరిగా తయారైందట వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి. ''నా బలపం పోయింది.. ఇప్పుడు అమ్మకు ఏం చెప్పను'' అని చిన్న పిల్లాడు ఏడ్చి మొత్తుకున్నట్టుగా ఉందట ఆయన గారి ఆవేదన. ఇంతకీ ఆయన ఎవరంటే.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సంతనూతల పాడు ఎమ్మెల్యే పీజే సుధాకర్‌బాబు. తాజాగా ఆయన ''నారా లోకేష్.. మా ఆవిడ తిడుతోంది.. ఏం చేయను?'' అని ఏడుపు మొహం పెట్టాడు. దీంతో మీడియామిత్రులు అవాక్కయ్యారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన సంతనూతలపాడులో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే పీజే ఆర్ సుధాకర్‌బాబుపై విమర్శలు గుప్పించారు. స్థానికంగా మామూళ్లు వసూలు చేస్తున్నారని.. అందిన కాడికి దోచేస్తున్నారని.. ఇలా విమర్శలు చేశారు. ఇవి సహజంగా రాజకీయ కోణంలో ప్రతిపక్ష నాయకులు చేసేవే. వీటికి ఆదారాలు.. ఇతరత్రా జమా ఖర్చులు అనేవి వుంటాయో ఉండవో తర్వాత మాట.
కానీ, ఈ వ్యాఖ్యలను పట్టుకుని పీజేఆర్ సుధాకర్‌బాబు మాత్రం.. చిన్నపిల్లాడి మాదిరిగా ఏడు మొహం పెట్టడం అందరినీ విస్మయానికి గురి చేసింది. 'రాజకీయాల్లో నేను అవినీతికి పాల్పడి వందల కోట్లు సంపాదించానని పాదయాత్రలో లోకేశ్ ఆరోపించారు. నేను ఆయన ప్రసంగాన్ని చూడలేదు. నా భార్య టీవీలో చూసింది. నువ్వు సంపాదించిన డబ్బంతా ఏం చేస్తున్నావని ఆవిడ ప్రశ్నిస్తోంది. ఆమెకు ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. దీంతో మా ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి.. ఇప్పుడు ఏం చేయాలి లోకేష్' అని సుధాకర్‌బాబు వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు ఆయనకు ఎలా ఉన్నాయో తెలియదు కానీ.. వినేవారికి.. మాత్రం సిల్లీగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.