ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల నోటీసులు.. ముహూర్తం ఫిక్స్!
ఈ నోటీసులకు స్పందించిన ఆర్జీవీ.. తాను సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నానని, వర్చువల్ విచారణకు హాజరవుతానని కోరుతూ.. స్టేషన్ కు తన న్యాయవాదులను పంపేవారు.
ఒంగోలులో నమోదైన కేసు మేరకు ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను విచారణకు రావాలంటూ ఏపీ పోలీసులు గత ఏడాది నవంబర్ లో ఒంగోలు నుంచి హైదరాబాద్ కు వచ్చి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లడం.. ఒంగోలు రూరల్ పోలీసులకు వాట్సప్ మెసేజ్ పెట్టడం తెలిసిందే.
ఈ నోటీసులకు స్పందించిన ఆర్జీవీ.. తాను సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నానని, వర్చువల్ విచారణకు హాజరవుతానని కోరుతూ.. స్టేషన్ కు తన న్యాయవాదులను పంపేవారు. ఈ క్రమంలో ఏపీలో వరుసగా తనపై నమోదైన కేసులపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. ఆర్జీవీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వ్యులు జారీ చేసింది.
ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ పెట్టి వాస్తవంగా జరిగింది ఇది.. తనపై ఓ వర్గం మీడియాలో జరిగిన ప్రచారం ఇది అంటూ వివరించే ప్రయత్నం చేశారు. తాను తన ఆఫీస్ (ఆర్జీవీ డెన్)లోనే ఉంటే తన కోసం రెండు రాష్ట్రాల పోలీసులు మూడు రాష్ట్రల్లో వెతుకుతున్నట్లు ప్రచారం చేశారని మండి పడ్డారు. ఈ సమయంలో ఆర్జీవీపై మరోసారి నోటీసులు పంపించారు!
అవును... ప్రముఖ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి నోటీసులు పంపించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో... ఫిబ్రవరి 4న ఆర్జీవీ ఒంగోలు పోలీసుల ముందు విచారణకు హారవుతారా.. లేక, గత ఏడాది నవంబర్ లో నడిచినట్లుగానే వ్యవహారం ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది!
కాగా... రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లతోపాటు వారి వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మండల టీడీపీ కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు.