హోండా జాజ్ కారు రివ్యూ!

Update: 2015-07-24 11:50 GMT
జపనీస్ కార్ తయారీ సంస్థ హోండా నుండి తాజాగా విడుదలైన కార్ హోండా జాజ్‌! ప్రస్తుతం భారత మార్కెట్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటోన్న ఈ హోండా జాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం! ప్రస్తుతం కుర్రకారుని, పెద్దవారిని సైతం తన స్టైల్ తో ఆకట్టుకుంటూ హుషారెక్కిస్తోందీ జాజ్! ఈ కారుకి సంబందించిన డిజైన్, ఇంజిన్ పవర్, మైలేజ్, ఇంటీరియర్ స్పేస్ తదితర విషయాలను ఒకసారి పరిశీలిద్దాం!

ముందుగా డిజైన్ విషయానికి వస్తే... హోండా జాజ్ డిజైన్ పరంగా స్పోర్టీ లుక్‌ను కలిగి ఉండటంతో పాటు, ముఖ్యంగా వ్రాప్ అరౌండ్ హెడ్‌లైట్స్, పెద్ద హోండా లోగోతో ముందు భాగం ఆకట్టుకుంటోందనే చెప్పాలి! ఇదేసమయంళో క్రోమ్‌ను తగ్గించడం వల్లోఏమో కానీ మరింత స్మార్ట్‌గా కన్పిస్తోంది. ఈ స్పోర్టీ లుక్ కేవలం ముందుభాగానికే కాకుండా కారు వెనక భాగంలో కూడా కొనసాగుతుంది! ఈ లార్జ్ టెయిల్ ల్యాంప్ ఈ జాజ్ కు మరింత అందాన్ని అందించిందనే చెప్పొచ్చు!

బయుటి అందమే కాదు.. కారు లోపల కూడా చక్కని ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి సౌకర్యంగా అందంగా ఉంది. ఇదే సమయంలో స్టోరేజ్ పరంగా కూడా అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతోపాటు మ్యాజిక్ సీట్స్ విషయంలో కూడా యుటిలిటీ మోడ్, టాల్ మోడ్, లాంగ్ మోడ్, రీఫ్రెష్ మోడ్ వంటి నాలుగు మోడ్‌లను కలిగి ఉన్నాయి. ఈ సీట్స్ ని మడచడం వల్ల కూడా మరింత స్పేస్ దొరుకుతుంది!

ఇక అసలైన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.... పెట్రోల్ కు సంబందించి... ఇంజన్ - 1.2లీ, ఐ-విటెక్. పవర్ - 90 బీహెచ్‌పీ. టార్క్ - 110 ఎన్ఎమ్! డీజల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఇంజన్ - 1.5లీ, ఐ-డీటెక్. పవర్ - 100 పీఎస్. టార్క్ - 200 ఎన్ఎమ్. ఇక పెట్రోల్ వేరియంట్ గేర్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లను కల్పిస్తోంది. డీజల్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను మాత్రమే అందిస్తోంది! మైలేజ్ విషయానికి వస్తే డీజిల్ ఇంజిన్ 27.3 కి.మీ./లీ, పెట్రోల్ ఇంజన్‍తో 18.7 కి.మీ/లీ మైలేజ్‌ను అందిస్తుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో అతిముఖ్యమైన వాటిలో భద్రత ఏస్థాయిలో ఉందో కూడా తెలుసుకోవడం అతిముఖ్యం! ఈ జాజ్ విషయానికి వస్తే... ఐబీఎస్. ఈబీడీ! డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ను కలిగి ఉంది!
ఫీచర్స్ అన్నీ తెలుసుకున్నాం కాబట్టి... ఇప్పుడు ధరలు తెలుసుకుండాం... (ఇవన్నీ ఢిల్లీ ఎక్స్ - షోరూం ధరలు)
డీజిల్ వేరియంట్ ధరలు పరిశీలిస్తే... జాజ్ ఈ - రూ.6.50 లక్షలు... ఎస్ - రూ.7.14 లక్షలు... ఎస్‌వి - రూ.7.65 లక్షలు... వి - రూ.8.10 లక్షలు... విఎక్స్ - రూ.8.59 లక్షలు!

ఇక పెట్రోలో వేరియంట్ ధర విషయానికి వస్తే... ఈ - రూ.5.31 లక్షలు... ఎస్ - రూ.5.94 లక్షలు... ఎస్‌వి - రూ.6.45 లక్షలు... వి - రూ.6.78 లక్షలు. విఎక్స్ - 7.29 లక్షలు. ఎస్ (సివిటి) - 6.99 లక్షలు... వి (సివిటి) - 7.85 లక్షలు!
Tags:    

Similar News