నీళ్లు.. 500 కి.మీ మైలేజీ

Update: 2015-07-28 10:32 GMT

Full View
ఓవైపు పెట్రోల్ రేటు అంతకంతకూ పెరిగిపోతోంది.. మరోవైపు బైకుల మైలేజీ చూస్తే అంతకంతకూ పడిపోతూనే ఉంది. వంద రూపాయలు పెట్టి పెట్రోల్ పోయిస్తే యాభై కిలోమీటర్లు కూడా  తిరగలేకపోతున్నాం. వంద కిలోమీటర్ల మైలేజీ అని చెప్పి పక్కన ఓ స్టార్ పెడతారు బైక్ యాడ్లో. కిందికి వెళ్తే ఎలాంటి పరిస్థితుల్లో వంద కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందో చెబుతూ ఓ పది కండిషన్స్ పెడతారు. మొత్తానికి మైలేజీ అనేది ఓ మిథ్య అని అర్థమవుతుంది. మరి పెట్రోల్ కాకుండా నీళ్లు పోస్తే తిరిగే బైక్ ఒకటి తయారు చేస్తే.. అది కూడా లీటర్ నీళ్లకు ఏకంగా 500 కిలోమీటర్ల మైలేజీ ఇస్తే.. ఎలా ఉంటుంది?

ఇలాంటి సపర్ బైక్ ఒకటి తయారు చేశాడు బ్రెజిల్ కు చెందిన  రికార్డో అజెవెడో. నమ్మశక్యం కాని ఆ బైకు గురించి డెమో చూపిస్తూ యూట్యూబ్ లో వీడియో కూడా పెట్టాడు రికార్డో. టీ పవర్ 20 అనే పేరు పెట్టిన ఈ బైకు విషయంలో ఓ ప్రయోగం చేశాడు రికార్డో. కరెంటు కోసం బ్యాటరీని అమర్చి.. నీళ్ల ద్వారా పవర్ రాబట్టే ఏర్పాటు చేశాడతను. ఆ విద్యుత్ తో బైక్ నడుస్తుందన్నమాట. మరి ఈ పద్ధతితో ఎప్పుడూ బైకు నడిపించవచ్చా లేదా అన్నది తేలాల్సి ఉంది. పర్యావరణానికి ఏమాత్రం హాని చేయకపోవడమే కాదు.. డెడ్ చీప్ గా నీళ్లతో నడిచే ఇలాంటి బైకుల్ని తయారు చేసి.. మార్కెట్లోకి తెస్తే విప్లవం రావడం ఖాయం. మరి రికార్డో ఆలోచన ఎలా ఉందో మరి.
Tags:    

Similar News