ఈమధ్య కాలంలోని సినిమాల్లో గ్రాఫిక్స్ పాళ్లు ఎక్కువవ్వడంతో ఆకాశం నుండి భూమిని, భూమిపైన ఉన్న ఒక ప్రదేశాన్ని కానీ, ప్రాంతాన్ని కానీ చూపిస్తున్నప్పుడు మొత్తం గ్లోబుని చూపిస్తుంటారు. ఓహో భూమి ఇలాగే ఉంటుందేమో అనుకుంటారు. కొన్ని సార్లు ఆ గ్రాఫిక్స్ మరింత అందంగా ఉండేటప్పటికి... ఇది గ్రాఫిక్స్ కదా ఇలానే ఉంటుంది అని నిరాశ చెందేవారు! కానీ... నిజంగా భూమి ఎంత అందంగా ఉంటుందో, దేవుడి సృష్టి అనండి, ప్రకృతి గొప్పతనం అనండి ఏమైనా కానీ... మనం నివసిస్తున్న భూమి చాలా అందంగా, వర్ణణాతీతంగా ఉంది!
విషయం ఏంఇటంటే.... ఈ నెల 6న నాసాకు చెందిన డీప్ స్పేస్ క్లైమేట్ అబ్జర్వేటరీ ఉపగ్రహం ఒకటి దానికి అమర్చి ఉన్న ఎర్త్ పాలిక్రోమాటీక్ ఇమేజింగ్ కెమేరాతో భూమిని ఫోటోలు తీసింది! అది కూడా సూర్యకాంతి భూమిపైన పడుతున్న వైపు! ఆ క్షణంలో ఒకేసారి పది క్లిక్కులు ఇచ్చింది! ఇంకే ముంది 10 ఫోటోలు వచ్చేశాయి! ఫోటో స్టూడియోలో మేకప్ వేసుకుని, స్టిల్ కెమేరాలో ఫోటోలు తీయించుకున్న అంత స్పష్టంగా, అందంగా వచ్చాయి! ఇంతకూ ఆ కెమేరా భూమి నుండి ఎంతదూరంలో ఫోటోలు తీసిందో తెలుసా... అక్షరాలా లక్షా అరవై వేల కిలోమీటర్ల దూరం నుండి!
ఈ ఫోటోలో భూమిపై ఉన్న వాతావరణం... వాయువులు, నీరు, పర్వతాలు, మైదాన ప్రాంతాలు, అరణ్యాలూ అన్నీ సుస్పష్టంగా కనిపిస్తున్నాయి! ఎక్కడబడితే అక్కడ చెత్త వేసేసి అత్యంత అపరిశుభ్రంగా, అందవిహీనంగా, చెట్లని నరికేసి పర్యావరణ కాలుషితంగా మనం తయారు చేస్తున్న భూమి ఇంత అందంగా ఉందా నిపించకమానదు ఈ ఫోటో చూస్తుంటే!
ఈ ఫోటో చూసిన ఒబామా ట్విట్టర్ లో స్పందించారు. "నాసా అందించిన భూమి తాజా చిత్రాన్ని ఇప్పుడే చూశాను. ఆ ఫోటో చూసిన వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది... మనకు ఉన్న ఏకైక అందమైన గ్రహం భూమి... దీన్ని తప్పనిసరిగా రక్షించుకోవాలని" అంటూ ట్వీట్ చేశారు! నిజంగానే భూమికి ఉన్న అందాన్ని కాపడుకుందాం... పర్యావరణాన్ని రక్షించుకుందాం!