హిందూ మహిళకు ట్రంప్ కీలక బాధ్యతలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ రెండో సారి విజయం సాధించారు. ఆయన మరికొద్ది రోజుల్లో రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ రెండో సారి విజయం సాధించారు. ఆయన మరికొద్ది రోజుల్లో రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ క్రమంలో తన కేబినెట్, తన ప్రభుత్వానికి సంబంధించి కసరత్తు ఇప్పటి నుంచే చేసుకుంటూ పోతున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ ఇండియన్ సంతతికి చెందిన వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
రెండో సారి అధ్యక్షుడిగా గెలిచిన తరువాత ట్రంప్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎలన్ మస్క్, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామికి తన కేబినెట్‌లో చోటు కల్పించారు. వీరికి ఎఫిషియెన్సీ బాధ్యతలు అప్పగించనట్లుగా ట్రంప్ ప్రకటించారు. తాజాగా.. హిందూ ఎంపీ తులసీ గబ్బార్డ్‌ని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు. ఆమె నియామకం సందర్భంగా తులసీ గబ్బార్డ్ గర్వించదగ్గ రిపబ్లికన్ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఆమె మనల్ని గర్వపడేలా చేస్తారని పేర్కొన్నారు. అయితే.. తులసి గబ్బార్డ్ అంతకుముందు డెమోక్రటిక్ పార్టీలో కొనసాగారు. ఆ తరువాత రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా నిలిచారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్, హారిస్ మధ్య డిబేట్ నిర్వహించిన సమయంలో ఈ తులసీ గబ్బార్డ్ ట్రంప్‌ను సిద్ధం చేశారు. 2020లో డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి తులసి గబ్బర్డ్ తన అభ్యర్థిత్వాన్ని సమర్పించారు. ఆ సమయంలో హారిస్ సైతం రేసులో నిలిచారు. వీరిద్దరి మధ్య అంతర్గత చర్చ జరిగింది. పెద్దగా మద్దతు లభించకపోవడంతో అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అయితే.. గత ఎన్నికల్లో డిబేట్ సమయంలో ట్రంప్‌ను సిద్ధం చేసిన వ్యక్తుల్లో తులసి గబ్బార్డ్ పేరు ప్రముఖంగా వినిపించింది. దాంతో ఎన్నికల తరువాత ఆమెకు కీలక పదవి దక్కబోతున్నదని అప్పుడే ప్రచారం జరిగింది. దాని ప్రకారమే ట్రంప్ తాజాగా.. ఆమెను యూఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించడం గమనార్హం.
తులసీ దాదాపు రెండు దశాబ్దాలు యూఎస్ ఆర్మీ అయిన నేషనల్ గార్డ్‌లో కొనసాగారు. ఆమె ఇరాక్, కువైట్‌లోనూ పనిచేశారు. కానీ.. ఇప్పటివరకు ఆమెకు నిఘా విభాగంలో పనిచేసిన అనుభవం లేదు. హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో పనిచేసిన అనుభవం ఉంది. తులసీ 2013-2021 వరకు హవాయి పార్లమెంట్ సభ్యురాలిగానూ కొనసాగారు. అయితే.. ఆమెకు భారత్‌తో ఎలాంటి సంబంధాలు కూడా లేవు. కానీ.. ఆమె తల్లి హిందూ మతాన్ని స్వీకరించారు. దాంతో ఆమె తన పిల్లలకు హిందూ పేర్లను పెట్టుకున్నారు. అయితే.. తులసీ గబ్బార్డ్ కూడా హిందూ మతాన్ని విశ్వసిస్తారు. ఆమె పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేశారు.