బేబీ బాక్సాఫీస్.. మొదట రోజే బీభత్సం

గత వారం కొన్ని సినిమాలు నిరాశపర్చినప్పటికీ ఈ వారం మాత్రం బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ తో టాలీవుడ్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన బేబీ సినిమా మొదటినుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒకవైపు కాంట్రవర్సీ రూట్లోనే హాట్ టాపిక్ గా నిలుస్తూనే మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం.

Update: 2023-07-15 06:40 GMT

ముందుగా బేబీ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక తర్వాత సినిమా మొదటిరోజు మొదటి ఆట నుంచి చాలా ఏరియాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో మంచి ఆరంభాన్ని ఇచ్చింది. బేబీ సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ అయితే దక్కుతుంది. ఇక ఏ సెంటర్స్ కంటే బీసీ సెంటర్లలో ఈ సినిమా పికప్ కావడానికి చాలా తక్కవ టైమ్ తీసుకుంది. నైట్ షో లతో మాత్రం మళ్లీ వెంటనే పికప్ అయిపోయింది.

సెకండ్ షో నుంచి మరింత కలెక్షన్స్ పెరిగాయి. బేబీ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 7.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మేయిన్ హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండకు బెస్ట్ రికార్డ్ అని చెప్పవచ్చు. దాదాపు టైర్ 2 హీరోల రేంజ్ కు చాలా దగ్గరగానే ఈ నెంబర్స్ ఉన్నాయి. బేబీ ఈ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని ఎవరు ఊహించలేదు.

ఆనంద్ దేవరకొండ కెరియర్ కు మాత్రం ఇది ఒక మర్చిపోలేని చిత్రంగా నిలవబోతున్నట్లుగా అర్థమవుతుంది. ముందుగానే చిత్ర యూనిట్ సినిమాపై కాన్ఫిడెంట్ తోనే ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించాయి. నిర్మాత SKN ప్రణాళిక ప్రకారం ఈ సినిమా రెండవ రోజు నుంచి మరింత కలెక్షన్స్ అందుకునే అవకాశం అయితే ఉంది. ఏపీ తెలంగాణలో కూడా ఈ సినిమాకు 4 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

ఓవర్సీస్ లో కూడా దాదాపు 80 లక్షలకు పైగా షేర్ కలక్షన్స్ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏడు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా రెండవ రోజు కూడా ఆ నెంబర్స్ ను మరింత పెంచుకునే అవకాశం ఉంది. ఇక బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 8 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఆదుకోవాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే ఇంకా ఈ సినిమా మరో నాలుగు కోట్లకు పైగా షేర్ కలక్షన్స్ అందుకుంటే సక్సెస్ అయినట్లు లెక్క. సినిమా హడావిడి చూస్తూ ఉంటే ఈ వీకెండ్ పూర్తయ్యో లోపు ప్రాఫిట్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News