కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

భారతదేశంలో మొదటి రోజు రూ.95 కోట్ల నెట్, రూ.115 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలిసింది.

Update: 2024-06-28 04:28 GMT

తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన కల్కి సినిమా ప్రీమియర్ షో నుంచే ఎపిక్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. తాజాగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు ఎంత అనేది బయటకు వచ్చింది. భారతీయ సినిమాలలో ఈ సినిమా మూడో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచి చరిత్ర సృష్టించినట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 180 కోట్లకు పూగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తుంది. అయితే ఆర్ఆర్ఆర్(రూ.223 కోట్లు), బాహుబలి (రూ.217 కోట్లు)ని మాత్రం కల్కి సినిమా బీట్ చేయలేకపోయింది. దీని తర్వాత సలార్ (రూ.158 కోట్లు), లియో (రూ.142.75కోట్లు), సాహో (రూ.130 కోట్లు), జవాన్ (రూ.129 కోట్లు) ఓపెనింగ్ కలెక్షన్స్ను కల్కి బీట్ చేసింది.

భారతదేశంలో మొదటి రోజు రూ.95 కోట్ల నెట్, రూ.115 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలిసింది. తెలుగులో రూ.64.5కోట్లు, హిందీలో రూ.24కోట్లు, తమిళంలో 4 కోట్లు,మలయాళంలో 2.2 కోట్లు, కర్ణాటకలో రూ.0.3కోట్లు అని ప్రస్తుతం అందిన వివరాలను బట్టి తెలుస్తుంది.

Tags:    

Similar News