ప్రియురాలుని చంపేసిన కాస్టింగ్ డైరెక్టర్!
తనతో రిలేషన్ షిప్ లో ఉన్న 18 ఎళ్ల యువతి శృంగారానికి నిరాకరించదనే కారణంతో దీపక్ మలాకర్ అనే క్యాస్టింగ్ చిత్రహింసలకు గురిచేసి.
సినిమా అవకాశాల పేరుతో జరుగుతోన్న మోసాలు రోజూ వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో జరిగినన ఓ దారుణ సంఘటన అందర్నీ కలచి వేస్తుంది. తనతో రిలేషన్ షిప్ లో ఉన్న 18 ఎళ్ల యువతి శృంగారానికి నిరాకరించదనే కారణంతో దీపక్ మలాకర్ అనే క్యాస్టింగ్ చిత్రహింసలకు గురిచేసి..తలపగలకొట్టిచంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీపక్ మలాకర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆగస్టు 11న ఈ ఘాతుకానికి పాల్పడి ముంబై నుంచి పరారయ్యాడు.
అక్కడ నుంచి పారిపోయి గుజరాత్ లో తలదాచుకున్నాడు. పోలీసులు విచారణ వేగవంతం చేసి ట్రేస్ చేసి మూడు రోజుల్లోనే పట్టుకున్నారు. పోలీసులు తమ స్టైల్లో విచారణ జరిపే సరికి నిజాలు కక్కాడు. డిగ్రీ చదువుతోన్న యువతి ఫేస్ బుక్ ద్వారా దీపక్ కి పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని రెండుసార్లు బాలిక తల్లిదండ్రుల్ని కలిసాడు. కుటుంబ సభ్యులు అంగీకరించారు.
ఈ క్రమంలోనే పెళ్లి కాకుండానే లివ్ ఇన్ రిలేషన్ షిప్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే యువతితో శారీరకం కలిసే ప్రయత్నం చేసినా ఆమె ఒప్పుకోలేదు. హిందీ పరిశ్రమలో సినిమా ప్రయత్నాలు చేయాలని.. నటిగా అదృష్టాన్ని పరీక్షించుకున్న తర్వాత పిల్లల గురించి ప్లాన్ చేసుకుందామని ప్లాన్ చెప్పిందిట. అప్పటివరకూ దగ్గరకు రాకూడదని హెచ్చరించిందిట.
ఈ క్రమంలోనే స్నేహితుల రూమ్ కి తీసుకెళ్లి అక్కడా లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె నిరాకరించిందిట. ఈ క్రమంలో కోపాని గురై ప్రియురాలి తలని గొడకేసి మోదినట్లు..అటుపై ముఖంపై దాడి చేసినట్లు తెలుస్తుంది. ఆ యువతి స్పృహ కోల్పోవడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత విషయం ప్లాట్ లో ఉన్న వారికి తెలియడంతో ఆ యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అటుపై మూడు రోజుల అనంతరం కన్ను మూసింది.