వేరే కులం అబ్బాయిని ప్రేమించిందని కూతురు గొంతు కోసేశాడు

కులం కాని కుర్రాడ్ని ప్రేమించిందన్న కోపంతో కన్నకూతుర్ని గొంతు కోసి చంపేసిన దారుణం చోటు చేసుకుంది. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.

Update: 2023-10-13 04:15 GMT

కులం కాని కుర్రాడ్ని ప్రేమించిందన్న కోపంతో కన్నకూతుర్ని గొంతు కోసి చంపేసిన దారుణం చోటు చేసుకుంది. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. తనకున్న ఇద్దరు కుమార్తెలు ప్రేమ పేరుతో తనకు ఇష్టం లేని వారిని పెళ్లి చేసుకోవాలన్న విషయాన్ని జీర్ణించుకోలేక.. గొంతు కోసం హత్య చేసిన దారుణం సంచలనంగా మారింది. బెంగళూరు శివారులో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళిత..

దేవనహళ్లి తాలూకా బిదనూరుకు చెందిన మంజూనాథ్ కు ఇద్దరు కుమార్తెలు. వారం క్రితం చిన్న కుమార్తె ఒక అబ్బాయిని ప్రేమిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న తండ్రి.. అందుకు వ్యతిరేకించారు. దీంతో.. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. తాను ప్రేమించిన అబ్బాయినే తాను పెళ్లి చేసుకుంటానని.. ఆ అమ్మాయి స్పష్టం చేయటంతో ఆమెను సంరక్షణ కేంద్రానికి తరలిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో పెద్ద కుమార్తె సైతం తానో కుర్రాడ్ని ప్రేమిస్తున్నట్లుగా తండ్రికి చెప్పింది. దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు మంజునాధ్. తమ కులం కాని కుర్రాడ్ని ప్రేమించటాన్ని అతను తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో.. తండ్రి - కుమార్తె మధ్య రోజంతా గొడవ జరిగింది. తనకు ఇష్టం లేని కుర్రాడ్ని పెళ్లి చేసుకుంటే బాగోదని తండ్రి తెగెసి చెప్పాడు. ప్రేమ పేరుతో తన పరువు తీస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆ తండ్రి.. కూతురు నిద్ర పోయిన తర్వాత కట్టెతో తలపై బలంగా కొట్టి.. గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

Tags:    

Similar News